Rohit Sharma Creates History: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ABN , Publish Date - Oct 23 , 2025 | 02:50 PM
రోహిత్ శర్మ సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా టూర్ లో మూడు వన్డేల సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచ్ లో క్రికెట్ ఫ్యాన్స్ ను నిరాశపర్చిన హిట్ మ్యాన్.. రెండో మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో రాణించి అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
క్రికెట్ న్యూస్: భారత జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన దూకుడు బ్యాటింగ్ తో అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా టూర్ లో మూడు వన్డేల సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచ్ లో క్రికెట్ ఫ్యాన్స్ ను నిరాశపర్చిన హిట్ మ్యాన్.. రెండో మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో రాణించి అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
వన్డేల్లో ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై 1000* పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ(Rohit Sharma Creates History) నిలిచాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా(India Australia Series) గురువారం జరుగుతున్న రెండో వన్డేలో హాఫ్ సెంచరీ చేయడంతో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో రోహిత్ తర్వాత విరాట్ కోహ్లీ(802), సచిన్ టెండూల్కర్ (740), ఎంఎస్ ధోనీ(684), శిఖర్ ధావన్(517) ఉన్నారు. కాగా రోహిత్ ఇప్పటి వరకు 275 వన్డేల్లో 11,184 పరుగులు చేశాడు. ఇందులో 32 సెంచరీలతోపాటు 59 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 264. ఈస్కోర్ 2014 నవంబర్ 13 ఈడెన్ గార్డెన్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో చేశాడు.
ఇక ఆడిలైడ్(Adelaide ODI)లో జరుగుతున్న రెండో వన్డే విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఒకే ఓవర్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్(9), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(0) వెనుదిరిగారు. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తడబడ్డారు. ఆచితూచి ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్నారు. 7వ ఓవర్ తొలి బంతికి శుభ్‌మన్ గిల్(9)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన బార్ట్‌లెట్.. ఐదో బంతికి కోహ్లీని వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దీంతో 17 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి రోహిత్ శర్మ(73)(Rohit Sharma) జట్టును ఆదుకున్నాడు. 74 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ.. స్టార్క్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. మొత్తంగా నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయిన భారత్ 264 పరుగులు చేసింది.
ఇవి కూడా చదవండి..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..
సత్య నాదెళ్ల వేతనం రూ.850 కోట్లు
మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..