Test or Ro-Ko: దిగ్గజాలకు రియల్ టెస్ట్.. కోహ్లీ, రోహిత్ ఆడిలైడ్‌లోనైనా రాణిస్తారా..
ABN , Publish Date - Oct 23 , 2025 | 07:12 AM
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దాదాపు ఏడు నెలల విరామం తర్వాత తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. ఇప్పటికే టీ-20, టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లీ భారత్ తరఫున వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బరిలోకి దిగారు.
విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) దాదాపు ఏడు నెలల విరామం తర్వాత తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. ఇప్పటికే టీ-20, టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లీ భారత్ తరఫున వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బరిలోకి దిగారు. అయితే పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో తీవ్రంగా నిరాశపరిచారు. ఆ మ్యాచ్‌లో జట్టు మొత్తం విఫలమైనా ఈ ఇద్దరిపైనే విమర్శలు వచ్చాయి (India vs Australia).
ఈ నేపథ్యంలో ఈ రోజు (గురువారం) ఆడిలైడ్‌లో రెండో వన్డే ప్రారంభం కాబోతోంది (Adelaide ODI). ఈ మ్యాచ్‌లోనైనా రాణించి విమర్శలకు చెక్ పెట్టాలని రోహిత్, కోహ్లీ కృత నిశ్చయంతో ఉన్నారు. ఆడిలైడ్‌లో కోహ్లీ రికార్డు ఘనంగా ఉంది. ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో కోహ్లీ మరో 25 పరుగులు చేస్తే ఆడిలైడ్‌లో 1000 పరుగులు చేసిన తొలి విదేశీ బ్యాటర్‌గా నిలుస్తాడు. ఇప్పటివరకు ఇక్కడ నాలుగు వన్డేలు ఆడిన కోహ్లీ రెండో సెంచరీలతో సహా 244 పరుగులు చేశాడు. ఈ రోజు మ్యాచ్‌లో కూడా రాణించాలని కృతనిశ్చయంతో ఉన్నాడు (Kohli form).
ఆడిలైడ్ పిచ్‌లో రోహిత్ శర్మ రికార్డు మాత్రం అత్యంత పేలవంగా ఉంది (Rohit Sharma performance). ఇప్పటివరకు ఈ మైదానంలో ఆరు వన్డే మ్యాచ్‌లు ఆడిన రోహిత్ కేవలం 147 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక్క అర్థశతకం కూడా లేదు. ఈ మైదానంలో రోహిత్ అత్యధిక స్కోరు 47 పరుగులు మాత్రమే. మరి, ఈ రోజు మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి. ఈరోజు జరగబోయే మ్యాచ్‌లో గెలిస్తేనే ఈ సిరీస్‌పై టీమిండియా ఆశలు సజీవంగా ఉంటాయి.
ఇవి కూడా చదవండి..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..
సత్య నాదెళ్ల వేతనం రూ.850 కోట్లు
మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..