Share News

Rohit half century: రాణించిన రోహిత్, అయ్యర్.. ఆస్ట్రేలియా టార్గెట్ 265..

ABN , Publish Date - Oct 23 , 2025 | 01:00 PM

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (73), శ్రేయస్ అయ్యర్ (61) రాణించడంతో ఆడిలైడ్‌లో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా కాస్త మెరుగైన స్థితిలో నిలిచింది. అక్షర్ పటేల్ (44) కూడా కీలక ఇన్నింగ్స్‌తో ఆదుకోవడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది.

Rohit half century: రాణించిన రోహిత్, అయ్యర్.. ఆస్ట్రేలియా టార్గెట్ 265..
India vs Australia

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (73), శ్రేయస్ అయ్యర్ (61) రాణించడంతో ఆడిలైడ్‌లో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా కాస్త మెరుగైన స్థితిలో నిలిచింది. అక్షర్ పటేల్ (44) కూడా కీలక ఇన్నింగ్స్‌తో ఆదుకోవడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు 270 పరుగుల టార్గెట్ ఉంచింది (India vs Australia).


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 9 పరుగులు మాత్రమే చేసి జేవియర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి పరుగులేమీ చేయకుండా వెనుదిరిగాడు. దీంతో 17 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో రోహిత్ (73), శ్రేయస్ అయ్యర్ (61) సమయోచితంగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు (Rohit Sharma batting). మూడో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.


రోహిత్, అయ్యర్ జోడీ కుదురుకోవడంతో భారీ స్కోరు ఖాయమనుకున్న దశలో మిచెల్ స్టార్క్ దెబ్బకొట్టాడు. రోహిత్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత టీమిండియా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ అర్ధశతకానికి చేరువలో అవుట్ అయ్యాడు. చివర్లో హర్షిత్ రాణా (24) కీలక పరుగులు చేశాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు వికెట్లు, జేవియర్ మూడు వికెట్లు, మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.


ఇవి కూడా చదవండి..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..

సత్య నాదెళ్ల వేతనం రూ.850 కోట్లు

మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 23 , 2025 | 01:00 PM