Team India: ఉబర్ బుక్ చేసుకున్న భారత ప్లేయర్లు!
ABN , Publish Date - Oct 25 , 2025 | 01:31 PM
ఓ వైపు మ్యాచ్‌ల టెన్షన్ ఉండగా.. మరోవైపు భారత యువ ఆటగాళ్లు షికార్లు చేస్తున్నారు. వాళ్లే స్వయంగా ఉబర్ బుక్ చేసుకుని మరీ వెళ్లారు. ఇంతకీ ఎవరు వెళ్లారు. ఎక్కడికి వెళ్లారంటే...
ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. మూడు వన్డేల సిరీస్‌తో పాటు టీ20 సిరీస్ కూడా ఆడనుంది. ఇప్పటికే రెండు వన్డేల్లో ఓటమి చవిచూసిన టీమిండియా.. చివరి మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. అయితే ఓ వైపు మ్యాచ్‌ల టెన్షన్ ఉండగా.. మరోవైపు భారత యువ ఆటగాళ్లు షికార్లు చేస్తున్నారు. వాళ్లే స్వయంగా ఉబర్ బుక్ చేసుకుని మరీ వెళ్లారు. ఇంతకీ ఎవరు వెళ్లారు. ఎక్కడికి వెళ్లారంటే..
యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, ప్రసిద్ధ్ కృష్ణ అడిలైడ్‌లో ఉబర్(Uber) బుక్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రైడ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. అయితే ఆ ఉబర్ డ్రైవర్ మాత్రం వీరిని గుర్తు పట్టలేదు. ప్రసిద్ధ్ ముందు సీట్‌లో కూర్చోగా.. యశస్వి, జురెల్ వెనక సీట్‌లో కూర్చున్నారు. వీరు సరదాగా సిటీలో తిరుగుతూ షాపింగ్ చేసిట్లు సమాచారం.
టీమిండియా(Team India) క్రికెటర్లు ఉత్సాహంగా షికార్లు చేస్తున్నా.. జట్టు పరిస్థితి మాత్రం అస్సలు బాలేదు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిని చవి చూసింది. సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన విరాట్, రోహిత్‌లు అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. ఇప్పటికే సిరీస్ చేజారినా.. ఈ మ్యాచ్‌లో అయినా సీనియర్లు రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
IND VS AUS: రెండో వన్డేలోనూ భారత్ ఓటమి
Virat Kohli Emotional: అడిలైడ్ మ్యాచ్‌లో భావోద్వేగానికి గురైన విరాట్ కోహ్లీ