Fire Accidents: అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే ఇలా మీ ప్రాణాలు కాపాడుకోండి..
ABN , Publish Date - Oct 25 , 2025 | 02:26 PM
ఇటీవల కాలంలో బస్సులు, కార్లలో ఫైర్ యాక్సిడెంట్ ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ సంఘటనలు ఎక్కువయ్యాయి. అయితే, అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే ఏం చెయ్యాలి? ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో బస్సులు, కార్లలో ఫైర్ యాక్సిడెంట్ ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ సంఘటనలు ఎక్కువయ్యాయి. మరీ ముఖ్యంగా కర్నూలులో నిన్న జరిగిన బస్సు ప్రమాదం అందరినీ కలచివేస్తోంది. వి. కావేరి ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢి కొట్టిడంతో 19 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. బస్సులో మంటలు చెలరేగడం అనేది క్షణాల్లో జరుగుతుంది. కానీ, త్వరగా రియాక్ట్ అయితే ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే, ఉన్నట్టుండి బస్సు లేదా కారులో అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే ఏం చెయ్యాలి? ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా, మంటలు అంటుకున్న సమయంలో ఆక్సిజన్ త్వరగా క్షీణిస్తుంది. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సైనైడ్, హైడ్రోజన్ క్లోరైడ్ వంటి విష వాయువులు పెద్ద మొత్తంలో గాల్లోకి విడుదలవుతాయి. అగ్ని ప్రమాదంలో ఆ విషపూరిత వాయువులు పీల్చడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. అగ్ని ప్రమాదాల్లో దాదాపు 80 శాతం మంది విషపూరిత వాయువులు పీల్చడం వల్లే చనిపోతున్నారు.
అగ్ని ప్రమాద సమయంలో ఏం చేయాలి?
ముందుగా ప్రమాదాన్ని గ్రహించిన వెంటనే బయటకి వెళ్ళే మార్గాలు చూడండి. డ్రైవర్‌ను అలర్ట్ చేయండి. ఒకవేళ మెయిన్ డోర్ క్లోజ్ అయితే, మరో ఎగ్జిట్ డోర్న్‌ను గుర్తించండి.
విష వాయువులు పీల్చకుండా మీ ముక్కు లేదా నోటికి అడ్డంగా మందపాటి వస్త్రం ఏదైనా పెట్టుకోండి.
ఇతరుల సాయంతో ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను ఓపెన్ చేయండి.
వ్యక్తిగత వస్తువులంటూ వాటి కోసం వెతికే ప్రయత్నం చేయకుండా తోటి ప్రయాణికులు బయటకు వెళ్లేలా సాయం చేయండి.
కారు లేదా బస్సులో మంటలు చెలరేగిన తర్వాత పేలుళ్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బస్సుకు దూరంగా ఉండాలి.
వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించండి. ప్రమాద స్థలం గురించి చెప్పండి. ఈ సూచనలు పాటించడం వల్ల బస్సులో మంటలు చెలరేగినప్పుడు సురక్షితంగా బయటపడే అవకాశం ఉంటుంది.
Also Read:
ఆన్‌లైన్‌లో మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ కాకుండా వేరే పార్శిల్ వస్తే.. ఇలా చేయండి.!
For More Latest News