Kavitha Speech at Gun Park: క్షమించండి.. కవిత భావోద్వేగం
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:48 AM
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎమోషనల్ అయ్యారు. అమరవీరుల కుటుంబాలకు అనుకున్నంత న్యాయం చేయలేకపోయాం అంటూ..
హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ అమరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉద్యమకారుల కోసం పోరాడలేకపోయామని, అమరవీరుల కుటుంబాలకు అనుకున్నంత న్యాయం చేయలేకపోయామని భావోద్వేగానికి లోనయ్యారు. ఉద్యమకారులకు న్యాయం జరిగేవరకు పోరాడనందుకు బహిరంగ క్షమాపణ చెప్పారు.
కాగా, కవిత నేటి నుంచి ‘జాగృతి జనం బాట’ కార్యక్రమం నిర్వహించనున్నారు. వరుసగా 4 నెలలపాటు ప్రజలతో ఉండేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. నిజామాబాద్‌కు నుంచి జనంబాట కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రజలు కోరుకుంటే కొత్త పార్టీని పెట్టేందుకు కూడా సిద్ధమని కవిత ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Also Read:
శీతాకాలంలో పసుపు నీరు తాగితే ఏమవుతుంది? నిపుణులు ఏమంటున్నారంటే..
మీరు ఎప్పుడైనా రివర్స్‌లో నడిచారా.. ఇలా నడవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో..!
For More Latest News