రాజస్థాన్‌తో మ్యాచ్.. ఎస్ఆర్‌హెచ్‌లో వారిద్దరిపై వేటు!
ABN , Publish Date - May 27 , 2026 | 04:48 PM
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. ఇవాళ చండీగఢ్ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. ఇవాళ చండీగఢ్ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి క్వాలిఫయర్ 2కు అర్హత సాధించాలని ఎస్‌ఆర్‌హెచ్ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తుది జట్టు ఎలా ఉంటుందా అనే ఆసక్తి ఆరెంజ్ ఆర్మీ అభిమానుల్లో ఉంది. ఈ ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లోఎస్ఆర్‌హెచ్ రెండు కీలక మార్పులతో బరిలోకి దిగనుందని సమాచారం.
మిడిలార్డర్ బ్యాటరైన స్మరణ్ రవిచంద్రన్‌ను పక్కన పెట్టాలని ఆరెంజ్ ఆర్మీ మేనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని మ్యాచ్‌ల్లో స్మరణ్‌కు అవకాశం లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే ఇవాళ జరిగే కీలక పోరుకు అతడిని తప్పించనున్నట్లు సమాచారం. అతడి స్థానంలో ఫినిషర్ అనికేత్ వర్మను తుది జట్టులోకి తీసుకోవాలని సన్ రైజర్స్ భావిస్తుందంట.
అనికేత్ కూడా అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయాడు. గత సీజన్‌లో దుమ్ములేపిన అనికేత్.. ఈ సీజన్‌లో మాత్రం విఫలమయ్యాడు. 8 ఇన్నింగ్స్‌లో కేవలం 79 పరుగులు చేశాడు. కానీ గత సీజన్‌లో అతడి ప్రదర్శన చూసిన ఆరెంజ్ ఆర్మీ మేనెజ్‌మెంట్.. అతడిపై నమ్మకం ఉంచిన మరో అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఎస్ఆర్‌హెచ్ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆడిన హర్షల్ పటేల్‌ను కూడా తిరిగి బెంచ్‌కే పరిమితం చేయనున్నట్లు క్రీడా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అతడి స్ధానంలో యువ పేసర్ ప్రపుల్ హింగేకు అవకాశమివ్వన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా స్మరణ్, హర్షల్ పటేల్ పై వేటు పడే అవకాశం ఉందని సమాచారం. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే.. మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
పిచ్ రిపోర్ట్:
నివేదికల ప్రకారం.. రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ కోసం మహారాజా యాదవేంద్ర సింగ్ పీసీఏ స్టేడియంలోని పిచ్ 4ను ఉపయోగించనున్నారు. ఇదే పిచ్‌పై పంజాబ్ కింగ్స్ తమ చివరి హోమ్ మ్యాచ్ ఆడి 200 పరుగులకు పైగా ఉన్న టార్గెట్‌ను సునాయాసంగా ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ వంటి విధ్వంసక ప్లేయర్లు ఉండటంతో ఎస్ఆర్‌హెచ్, ఆర్ఆర్ జట్లు టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతాయని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎలిమినేటర్ మ్యాచ్‌కు ఎస్‌ఆర్‌హెచ్ తుది జట్టు(అంచనా):
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్.
ఇంపాక్ట్ సబ్: ప్రఫుల్ హింగే.
ఇవి కూడా చదవండి:
చెన్నై సూపర్ కింగ్స్ కోచ్‌గా ఎంఎస్ ధోనీ!
సినిమాను మించిన ట్విస్టులతో సాగిన స్టార్ క్రికెటర్ లవ్ స్టోరీ!