నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. 20 మందికి గాయాలు
ABN , Publish Date - May 27 , 2026 | 04:25 PM
నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలం పడుగుపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, ఎక్స్‌కవేటర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు డ్రైవర్లతో పాటు సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
నెల్లూరు జిల్లా: కోవూరు మండలం పడుగుపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి కావలికి వెళ్తున్న నాన్‌స్టాప్ ఆర్టీసీ బస్సు, ఎక్స్‌కవేటర్ ఢీకొన్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లతో పాటు సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో బస్సు డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. స్థానికులు తీవ్రంగా శ్రమించి డ్రైవర్‌ను బయటకు తీసుకొచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో భారీగా ఎమ్మార్వోలు బదిలీ
నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. మహానాడులో సీఎం చంద్రబాబు పంచ్ డైలాగ్స్
For More AP News