Share News

ఇషా ప్రపంచ రికార్డు

ABN , Publish Date - May 28 , 2026 | 02:16 AM

హైదరాబాద్‌ షూటర్‌ ఇషా సింగ్‌ మరోసారి అంతర్జాతీయ వేదికపై అదరగొట్టింది. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్‌ ప్రపంచక్‌పలో...

ఇషా ప్రపంచ రికార్డు

  • షూటింగ్‌ ప్రపంచక్‌పలో స్వర్ణం కైవసం

మ్యూనిచ్‌ (జర్మనీ): హైదరాబాద్‌ షూటర్‌ ఇషా సింగ్‌ మరోసారి అంతర్జాతీయ వేదికపై అదరగొట్టింది. ఐఎస్ఎస్ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచక్‌పలో ప్రపంచ రికార్డు ప్రదర్శనతో స్వర్ణం కైవసం చేసుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్స్‌లో ఇషా.. 43 పాయింట్లు స్కోరు చేసి నయా ప్రపంచ రికార్డు సృష్టించింది. తద్వారా రెండేళ్ల క్రితం బాకు (అజర్‌బైజాన్‌)లో కొరియా షూటర్‌ కిమ్‌ ఏజీ నమోదు చేసిన 42 పాయింట్ల ప్రపంచ రికార్డు స్కోరును ఇషా దాటేసింది. స్థానిక షూటర్‌ డొరీన్‌ వెనెకాంప్‌ రజతం, మిన్‌చెవా (బల్గేరియా) కాంస్యం నెగ్గారు. 21 ఏళ్ల ఇషాకు ఇది నాలుగో వ్యక్తిగత ప్రపంచకప్‌ పతకం.

ఇవి కూడా చదవండి:

రాజస్థాన్‌తో మ్యాచ్.. ఎస్ఆర్‌హెచ్‌లో వారిద్దరిపై వేటు!

సినిమాను మించిన ట్విస్టులతో సాగిన స్టార్ క్రికెటర్ లవ్ స్టోరీ!

Updated Date - May 28 , 2026 | 05:01 PM