Share News

రవిశాస్త్రి ప్రశ్నకు వైభవ్ సూర్యవంశీ క్రేజీ ఆన్సర్! వీడియో వైరల్...

ABN , Publish Date - Jun 01 , 2026 | 01:15 PM

ఐపీఎల్ 2026 ఫైనల్ వేళ ప్రజెంటేషన్ వేడుకలో అభిమానుల దృష్టంతా రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ఈ సీజన్లో తన అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టిన వైభవ్ .. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు ప్రతిష్ఠాత్మక అవార్డులను కొల్లగొట్టాడు.

రవిశాస్త్రి ప్రశ్నకు వైభవ్ సూర్యవంశీ క్రేజీ ఆన్సర్! వీడియో వైరల్...
Vaibhav Suryavamsi IPL 2026

స్పోర్స్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో తన అద్భుత బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కులు చూపించిన రాజస్థాన్ రాయల్స్ యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 5 ప్రతిష్ఠాత్మక అవార్డులను కొల్లగొట్టాడు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఆరెంజ్ క్యాప్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, మోస్ట్ సిక్సర్స్ అవార్డులను ఈ 15 ఏళ్ల కుర్రాడే దక్కించుకోవడం విశేషం. అందుకే ఆదివారం జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ వేడుకలో అభిమానుల దృష్టంతా ఈ బుడ్డొడిపైనే ఉంది.


వైభవ్ సూర్యవంశీ వరుసగా ఐదు అవార్డులను అందుకోవడానికి స్టేజ్ పైకి వెళ్లినప్పుడు.. అక్కడ కామెంటేటర్‌గా ఉన్న టీమిండియా మాజీ దిగ్గజం రవిశాస్త్రి సైతం అతడికి ఫిదా అయ్యాడు. వైభవ్ కొట్టే సిక్సర్ల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో రవిశాస్త్రి ఓ ఫన్నీ ప్రశ్న వేశాడు. 'నువ్వు రోజుకు ఎన్ని పాలు తాగుతావు?' అని రవిశాస్త్రి అడిగాడు. ఈ ఊహించని సరదా ప్రశ్నకు స్టేడియంలో ఉన్నవారంతా నవ్వేశారు.


రవిశాస్త్రి అడిగిన ప్రశ్నకు ఈ 15 ఏళ్ల బుడ్డోడు అంతే అమాయకంగా, నవ్వుతూ.. 'ప్రస్తుతం నేను పాలు తాగడం లేదు' అని సమాధానం ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల 65 రోజుల వయసులోనే ఆరెంజ్ క్యాప్ గెలుచుకుని ఐపీఎల్ చరిత్రలోనే ఓ కొత్త రికార్డును లిఖించాడు. ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ అందుకున్న అత్యంత చిన్న వయస్కుడిగా వైభవ్ నిలిచాడు.


ఇవి కూడా చదవండి:

ఆర్సీబీ విజయం.. బెంగళూరులో అభిమానుల వీరంగం

టైటిల్‌తో పాటు ఆర్సీబీ ఖాతాలో అరుదైన రికార్డ్

Updated Date - Jun 01 , 2026 | 01:36 PM