Share News

తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:11 PM

తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంగ్ రూట్లో వస్తున్న రెండు బైకులను ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు.

తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం
Chennai road accident

చెన్నై, జూన్ 01: నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిద్రమత్తు వంటి వివిధ కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకోగా.. ముగ్గురు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...


చెన్నై - బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్- 48)పై వెల్లూరు మండలం అబ్దుల్లాపురం గ్రామం సమీపంలో రెండు బైకులు రాంగ్ రూట్‌లో వస్తున్నాయి. అదే మార్గంలో వస్తున్న కారు.. ఈ రెండు ద్విచక్రవాహనాలను బలంగా ఢీ కొట్టింది. ఈ క్రమంలో కారు అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లి ఒక చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకులపై ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మృతి చెందారు.


మృతులను కె. అనబళగన్ (68), ఆర్. సుబ్రమణి (72), ఎస్. అరుణ్‌కుమార్ (22) గా పోలీసులు గుర్తించారు. వీరంతా వెల్లూరు ప్రాంతానికి చెందిన వారు. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు. కారు డ్రైవర్ చెన్నై సమీపంలోని రెడ్ హిల్స్‌కు చెందిన ఎస్. కార్తిగా పోలీసులు గుర్తించారు. అతడు తన కుటుంబ సభ్యులతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో.. అకస్మాత్తుగా ఎదురుగా బైకులు రావడంతో కారు నియంత్రణ కోల్పోయింది.


ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది. గాయపడిన వారిని రక్షించిన స్థానికులు వెల్లూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న వెల్లూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అన్యాయం.. ఐపీఎల్ ఫైనల్ వేదికపై డీకే శివకుమార్ ఆగ్రహం..

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 01 , 2026 | 12:47 PM