Share News

ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అన్యాయం.. ఐపీఎల్ ఫైనల్ వేదికపై డీకే శివకుమార్ ఆగ్రహం..

ABN , Publish Date - Jun 01 , 2026 | 07:04 AM

ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. వరుసగా రెండో సారి ఐపీఎల్ ట్రోఫీ సాధించింది.

ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అన్యాయం.. ఐపీఎల్ ఫైనల్ వేదికపై డీకే శివకుమార్ ఆగ్రహం..
DK Shivakumar

ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. వరుసగా రెండో సారి ఐపీఎల్ ట్రోఫీ సాధించింది. అయితే ఐపీఎల్ ఫైనల్ వేదికపై కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అన్యాయం జరిగిందని అన్నారు (DK Shivakumar RCB Fans).


'ఫైనల్ మ్యాచ్ బెంగళూరులో జరగాల్సింది. కొన్ని కారణాల వల్ల మ్యాచ్‌ను మరో వేదికలో నిర్వహించారు. ఆర్సీబీ అభిమానులకు అన్యాయం జరిగింది. దీనిపై ఎక్కువగా మాట్లాడదలచుకోలేదు' అని శివకుమార్ పేర్కొన్నారు. కాగా, వరుసగా రెండో టైటిల్ సాధించిన ఆర్సీబీ జట్టుకు, ఆటగాళ్లకు, కోచింగ్ సిబ్బందికి శివకుమార్ అభినందనలు తెలిపారు. జట్టు అద్భుత ప్రదర్శనతో మరోసారి ఛాంపియన్‌గా నిలవడం కర్ణాటక ప్రజలకు గర్వకారణమని ప్రశంసించారు (Bengaluru IPL Final).


విరాట్ కోహ్లీ వేగవంతమైన అర్ధశతకంతో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును గెలిపించాడు (IPL 2026 Final). గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో గుజరాత్ టైటాన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.


ఇవి కూడా చదవండి:

ఇషాన్ కిషన్‌ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్

ఐపీఎల్ ఫైనల్‌: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 01 , 2026 | 07:14 AM