Share News

ఐపీఎల్ ఫైనల్‌: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - May 31 , 2026 | 03:47 PM

గతేడాది ఆర్సీబీకి తొలి ఐపీఎల్ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ.. జట్టుకు వరుసగా రెండో కిరీటం అందించాలనే లక్ష్యంతో ఉన్నాడు. మరి విరాట్ గత ఐపీఎల్ ఫైనల్‌ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

ఐపీఎల్ ఫైనల్‌: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పైనే ఉంది. గతేడాది ఆర్సీబీకి తొలి ఐపీఎల్ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ.. జట్టుకు వరుసగా రెండో కిరీటం అందించాలనే లక్ష్యంతో ఉన్నాడు. మరి విరాట్ గత ఐపీఎల్ ఫైనల్‌ రికార్డులు ఎలా ఉన్నాయంటే..


ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకోవడం ఇది ఐదోసారి. గతంలో 2009లో డెక్కన్ ఛార్జర్స్, 2011లో చెన్నై సూపర్ కింగ్స్, 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఆర్సీబీ ఫైనల్ పోరులో పరాజయం పాలైంది. 2016లో డేవిడ్ వార్నర్ నేతృత్వంలో ఎస్ఆర్‌హెచ్‌ ఐపీఎల్ ట్రోఫీ నెగ్గింది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీకి కెప్టెన్‌గా ఉన్న విరాట్.. 54 పరుగులతో పోరాడినా జట్టు టైటిల్ గెలవలేకపోయింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ రజత్ పాటీదార్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయం సాధించిన ఆర్సీబీ.. 2025 ఐపీఎల్ ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది.


ఫైనల్‌లో కోహ్లీ గణాంకాలు..

ఐపీఎల్ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ రికార్డులు చెప్పుకోదగినట్లుగా లేవు. లీగ్ దశలో అద్భుతంగా రాణించే కోహ్లీ.. ప్లే ఆఫ్స్, ఫైనల్‌లో మాత్రం తడబడుతూ వస్తున్నాడు. ఇప్పటి వరకు కోహ్లీ నాలుగు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 126.36 స్ట్రైక్ రేట్‌తో 139 పరుగులు మాత్రమే చేశాడు. ఇది విరాట్ ఐపీఎల్ కెరీర్ రికార్డు కంటే తక్కువ. ఫైనల్‌లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 54. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 2016లో ఈ స్కోర్ నమోదు చేశాడు. ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. గత రికార్డులను చెరిపేసి దూకుడుగా ఆడుతాడా? జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తాడా? అనేది చూడాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

రెజ్లింగ్ ట్రయల్స్‌లో ఓటమిపాలైన వినేశ్

ఐపీఎల్2026: సన్‌ రైజర్స్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌

Updated Date - May 31 , 2026 | 03:48 PM