Share News

రెజ్లింగ్ ట్రయల్స్‌లో ఓటమిపాలైన వినేశ్

ABN , Publish Date - May 30 , 2026 | 05:35 PM

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆసియా క్రీడల ఎంపిక కోసం జరిగిన ట్రయల్స్‌లో ఓటమి పాలయ్యారు. ఆమె మహిళల 53 కేజీల విభాగం సెమీఫైనల్స్‌లో మీనాక్షి గోయత్ చేతిలో ఓడారు.

రెజ్లింగ్ ట్రయల్స్‌లో ఓటమిపాలైన వినేశ్

స్పోర్ట్స్ డెస్క్: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్‌లో ఓటమి పాలయ్యారు. మహిళల 53 కేజీల విభాగం సెమీఫైనల్స్‌లో ఆమె మీనాక్షి గోయత్ చేతిలో 4-6 తేడాతో పరాజయం చెందారు. ఈ ఓటమితో వినేశ్ ఫొగాట్ ఆసియా క్రీడల 2026 ఎంపిక ట్రయల్స్ నుంచి నిష్క్రమించింది.


ట్రయల్స్‌లో బాగా రాణించి.. అంతర్జాతీయ స్థాయిలో పునరాగమనం చేయాలన్న వినేశ్ ఆశలకు, అలాగే ఈ ఏడాది చివర్లో జపాన్‌లోని ఐచి నగోయాలో జరగనున్న ఆసియా క్రీడలలో స్థానం సంపాదించుకోవాలన్న ఆమె అవకాశాలకు ఈ ఓటమి గండికొట్టింది. గత మ్యాచ్‌లో నిషుతో హోరాహోరీగా జరిగిన బౌట్‌లో వినేశ్ తనకున్న ఎన్నో ఏళ్ల అనుభవాన్ని ఉపయోగించి విజయం సాధించి సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. ఫైనల్ ముంగిట ఆమెకు మీనాక్షి చేతిలో పరాజయం ఎదురైంది.

Updated Date - May 30 , 2026 | 05:46 PM