ఐపీఎల్-2026 విజేత ఎవరు.. అశ్విన్ చెప్పిన జోస్యం ఏంటంటే..
ABN , Publish Date - May 31 , 2026 | 01:36 PM
మరికాసేపట్లో అహ్మదాబాద్‌లో ఐపీఎల్-2026 ఫైనల్ మ్యాచ్ మొదలు కాబోతోంది. టోర్నీ ఆద్యంతం అద్భుతంగా రాణించి లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్లో తలపడబోతున్నాయి.
మరికాసేపట్లో అహ్మదాబాద్‌లో ఐపీఎల్-2026 ఫైనల్ మ్యాచ్ మొదలు కాబోతోంది. టోర్నీ ఆద్యంతం అద్భుతంగా రాణించి లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్లో తలపడబోతున్నాయి. ఈ రెండు జట్లూ ఇంతకు ముందు ఒక్కోసారి టైటిల్ దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లలో ఏది రెండో టైటిల్ దక్కించుకుంటుందనే ఆసక్తి నెలకొంది. ఫైనల్ విజేతపై మాజీ క్రికెటర్ అశ్విన్ కీలక కామెంట్లు చేశాడు (IPL Winner Prediction).
'ఈ సీజన్ మొత్తం ఆర్సీబీ అద్భుత స్థిరత్వం ప్రదర్శించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతుల్యత, కీలక సమయాల్లో ఆటగాళ్ల ప్రదర్శన జట్టును ప్రత్యేకంగా నిలబెట్టాయి. ముఖ్యంగా ప్లే-ఆఫ్స్ దశలో జట్టు చూపించిన ఆత్మవిశ్వాసం ఎంతో ఆకట్టుకుంది. ప్లే-ఆఫ్స్‌లో ఇప్పటికే గుజరాత్‌ను ఓడించింది. నా అభిప్రాయం ప్రకారం ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీ చేతుల్లో ఉంది. వరుసగా మరో టైటిల్ సాధించేందుకు ఆ జట్టు సిద్ధమవుతోంది' అని అశ్విన్ పేర్కొన్నాడు (Ashwin on RCB).
'ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నుంచి కూడా గట్టి పోటీని ఆశించవచ్చు (RCB vs GT). గిల్, సాయి సుదర్శన్ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ఫైనల్‌లో ఒత్తిడిని ఎవరు బాగా ఎదుర్కొంటారన్నదే ఫలితాన్ని నిర్ణయిస్తుంది. హోమ్ గ్రౌండ్‌లో ఆడుతుండడం గుజరాత్ టైటాన్స్‌కు బలం. అక్కడి పరిస్థితులపై వారికి అవగాహన ఎక్కువ. ఏదేమైనా ఈ సీజన్ మొత్తం ఆడినట్టుగానే చివరి మ్యాచ్‌లో కూడా ఆడితే టైటిల్ ఆర్సీబీ సొంతమవడం ఖాయం' అని అశ్విన్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి..
దిగ్బంధనాన్ని ఉల్లంఘించిన నౌక.. అమెరికా క్షిపణి దాడి..
బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..