బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - May 02 , 2026 | 06:52 AM
అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, డాలర్ బలపడడం వంటి కారణాలతో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. శనివారం ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, డాలర్ బలపడడం వంటి కారణాలతో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వెళ్లిన బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుతుండడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది (Gold and Silver Rates).
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,50,370గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,37,840గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,50,420గా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,37,990గా ఉంది (Live Gold Rates).
మరోవైపు వెండి ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి (Silver prices today). కిలోకు వంద రూపాయల మేర పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,64,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,55,100గా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.రూ.2,64,900గా, బెంగళూరులో రూ.రూ.2,55,100 ఉంది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి..
మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు
భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌ను తోసిపుచ్చిన ఈసీ