Share News

భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌‌ను తోసిపుచ్చిన ఈసీ

ABN , Publish Date - May 01 , 2026 | 02:42 PM

భవానీపూర్‌లో పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సౌత్ కోల్‌కతాలోని స్ట్రాంగ్‌ రూమ్‌కు వెళ్లడం, బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తలెత్తిన హైడ్రామాపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ టీఎంసీ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది.

భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌‌ను తోసిపుచ్చిన ఈసీ
Elections commission and Mamata Banerjee

కోల్‌కతా: భవానీపూర్‌లో పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సౌత్ కోల్‌కతాలోని స్ట్రాంగ్‌ రూమ్‌కు వెళ్లడం, బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తలెత్తిన హైడ్రామాపై ఎన్నికల కమిషన్ (Election Commission) స్పందించింది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ తృణమూల్ కాంగ్రెస్ (TMC) చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది.


మమతా బెనర్జీ పోటీచేసిన భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కౌంటింగ్ సెంటర్ సఖావత్ మెమోరియల్ స్కూల్‌లో ఉంది. అక్కడి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసేందుకు బీజేపీ ప్రయత్నించినట్టు టీఎంసీ కార్యకర్తలు ఆరోపించారు. అయితే టీఎంసీ ఆరోపణను నార్త్ కోల్‌కతా జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) స్మితా పాండే తోసిపుచ్చారు. పోస్టల్ బ్యాలెట్లను సెగ్రిగేట్ చేయడానికి చట్టబద్ధమైన ప్రక్రియ ఉంటుందన్నారు. ఎన్నికల విధుల్లో ఉంటే అధికారులు, సిబ్బంది నేరుగా ఓటు వేయలేరని, అందువల్ల ఫెసిలిటేషన్ సెంటర్‌లో వారు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్పారు. ఈ ప్రక్రియ కూడా పూర్తి కట్టుదిట్టమైన, భద్రతా వాతావరణంలో జరుగుతుందన్నారు. 'మా వాళ్లు కారిడార్‌లో కూర్చుని ఉన్నారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌కు సీల్ వేసి ఉంది' అని చెప్పారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్ల నిర్వహణ ఉంటుందని, ఈవీఎం రూమ్ సెపరేట్‌గా, పోస్టల్ బాలెట్ల రూమ్ సెపరేట్‌గా ఉంటాయని, తాము వాటిని తొలగించి సెగ్రిగేట్ చేస్తామని వివరించారు.


మమత వార్నింగ్

ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణల నేపథ్యంలో కౌంటింగ్ సెంటర్ వద్ద మమతాబెనర్జీ గురువారం రాత్రి సుమారు నాలుగు గంటలు ఉన్నారు. నిష్పాక్షిక ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు పారదర్శకత, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరని ఆమె ఉన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే ఎలాంటి చర్యలను సహించేది లేదని హెచ్చరించారు. ప్రజల ఓట్లను పరిక్షించాలని, తనకు పలు ఫిర్యాదులు రావడంతో ఇక్కడకు వచ్చానని, కేంద్ర బలగాలు తొలుత తనను లోపలకు రానీయలేదని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

బెంగాల్‌, అస్సాంలో బీజేపీ ప్రభంజనం

పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన హర్భజన్ సింగ్

Updated Date - May 01 , 2026 | 03:47 PM