బెంగాల్, అస్సాంలో బీజేపీ ప్రభంజనం
ABN , Publish Date - May 01 , 2026 | 06:24 AM
పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయని టుడేస్ చాణక్య సంస్థ అంచనా వేసింది. అలాగే...
తమిళనాడులో డీఎంకే, కేరళలో యూడీఎఫ్
టుడేస్ చాణక్య అంచనా
బెంగాల్ ఎగ్జిట్‌పోల్స్ ఇవ్వలేం : యాక్సిస్ మై ఇండియా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయని టుడేస్ చాణక్య సంస్థ అంచనా వేసింది. అలాగే, తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారం నిలబెట్టుకోనుందని, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, అధికార ఎల్‌డీఎఫ్ మధ్య గట్టిపోటీ నెలకొందని ఆ సంస్థ పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని ఇప్పటికే ఎగ్జిట్‌పోల్ నిర్వహించిన మెజారిటీ సంస్థలు ప్రకటించగా టుడేస్ చాణక్య సంస్థ కూడా గురువారం అదే విషయాన్ని వెల్లడించింది. బెంగాల్ అసెంబ్లీలోని మొత్తం 294 స్థానాల్లో బీజేపీ 192 సీట్లు గెలిచే అవకాశముందని ఆ సంస్థ ప్రకటించింది. టుడేస్ చాణక్య తన అంచనాలను విశ్లేషణ పేరుతో విడుదల చేసింది. టీఎంసీకి 100, ఇతరులకు 2 స్థానాలు లభిస్తాయని పేర్కొంది. బీజేపీకి 48ు, తృణమూల్‌కు 38ు, ఇతరులకు 14ు ఓట్లు పడనున్నాయని తేల్చింది. బీజేపీ, టీఎంసీకి వచ్చే సీట్లలో 11 సీట్లు తగ్గడం కానీ పెరగడం కానీ ఉండవచ్చునని అంచనా వేసింది. బీజేపీకి ఎస్సీల్లో 67ు, ఓబీసీల్లో 61ు, ఎస్టీల్లో 53ు, ముస్లింలలో 8ు ఓట్లు పడ్డాయని పేర్కొంది. అదే తృణమూల్‌కు ముస్లింలలో 72ు, ఎస్సీల్లో 22ు, ఓబీసీల్లో 27ు, ఎస్టీల్లో 40ు ఓట్లు పడ్డాయని తెలిపింది. కాగా, పశ్చిమ బెంగాల్‌కు సంబంధించి ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను ఇవ్వలేమని యాక్సిస్ మై ఇండియా గురువారం ప్రకటించింది. బెంగాల్ ఓటర్లు సర్వేకు సహకరించకపోవడం వల్లే ఎగ్జిట్‌పోల్స్ ఇవ్వడం లేదని వెల్లడించింది. అస్సాంలో 125 సీట్లలో బీజేపీకి 102, కాంగ్రె్‌సకు 23, ఇతరులకు ఒక సీటు లభిస్తాయని టుడేస్ చాణక్య చెప్పింది. బీజేపీ, కాంగ్రె్‌సకు వచ్చే సీట్లలో 9 సీట్లు తగ్గడం కానీ, పెరగడం కానీ ఉంటుందని తేల్చింది.
డీఎంకేకు 125
తమిళనాడులోని 234 సీట్లలో డీఎంకే కూటమికి 125, అన్నాడీఎంకే కూటమికి 45, సినీనటుడు విజయ్ నేతృత్వంలోని టివీకేకు 63 సీట్లు, ఇతరులకు ఒక సీటు లభించనున్నట్లు టుడేస్ చాణక్య తేల్చింది. టీవీకేకు ప్రతిపక్ష స్థానం లభిస్తుందని అంచనా వేసింది. ముస్లింల్లో 64 శాతం, క్రైస్తవుల్లో 49ు, బీసీల్లో 36ు, ఎంబీసీల్లో 43ు మంది డీఎంకేకు ఓటు వేశారని టుడేస్ చాణక్య చెప్పింది. డీఎంకే తర్వాత ఎస్సీలు, ముస్లింలు, క్రైస్తవులు అధికంగా టీవీకే పక్షాన నిలిచారని అంచనా వేసింది. టీవీకేకు ముస్లింలు 25 శాతం, ఎస్సీలు 34 శాతం, ఎంబీసీలు 27 శాతం, బీసీలు 29 శాతం క్రైస్తవులు 34 శాతం ఓట్లు వేశారని పేర్కొంది. మరోపక్క, కేరళలో యూడీఎఫ్ 69 సీట్లతో అధికారంలోకి వచ్చే అవకాశముందని, ఎల్డీఎఫ్‌కు 64 సీట్లు లభించున్నాయని అంచనా వేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కేరళలో ఈసారి బీజేపీకి ఏడు సీట్లు వచ్చే అవకాశముందని తెలిపింది. కేరళలోని ముస్లింలలో అఽధికంగా 62ు మంది ఈ సారి కాంగ్రె్‌సకే ఓటు వేశారని, 33ు ఎల్డీఎఫ్ వైపు మొగ్గు చూపారని టుడేస్ చాణక్య తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికాకు హ్యాండిచ్చిన పాక్.. ఇరాన్‌కు సాయం!
పుతిన్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రంప్.. 90 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..