Share News

పుతిన్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రంప్.. 90 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..

ABN , Publish Date - Apr 30 , 2026 | 12:54 PM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన అంశాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ మాట్లాడారు. ఈ ఇరువురూ దాదాపు 90 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నారు.

పుతిన్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రంప్.. 90 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..
Trump Putin call 2026

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన అంశాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ మాట్లాడారు. ఈ ఇరువురూ దాదాపు 90 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ సహాయకుడు యూరీ ఉషాకోవ్ వెల్లడించారు (Putin Iran uranium).


ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్చలకు దిగితే అత్యంత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని డొనాల్డ్ ట్రంప్‌ను పుతిన్ హెచ్చరించారని ఉషాకోవ్ పేర్కొన్నారు. అలాగే ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు నిర్ణయాన్ని పుతిన్ స్వాగతించారన్నారు. ఇరాన్‌తో ఉద్రిక్తతలను ముగించేందుకు అవసరమయ్యే దౌత్య ప్రయత్నాలకు రష్యా సిద్ధంగా ఉందని ట్రంప్‌నకు పుతిన్ చెప్పారని తెలిపారు. అలాగే ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా ఇరు దేశాల నేతలు మాట్లాడుకున్నట్టు పేర్కొన్నారు (Trump Putin call 2026).


కాగా, ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల గురించి పుతిన్‌ తనతో మాట్లాడినట్టు ట్రంప్ వెల్లడించారు (Ukraine war Trump Putin). ఇరాన్ వద్ద ఉన్న అణు నిల్వల విషయంలో సహాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే వాటిని రష్యాకు తరలిస్తామని తనతో పుతిన్ చెప్పారని ట్రంప్ తెలిపారు. అయితే, 'మీరు నాకు సహాయం చేసే ముందు, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంపై దృష్టి పెట్టండి' అని తాను బదులిచ్చినట్టు ట్రంప్ పేర్కొన్నారు. అలాగే ఉక్రెయిన్‌తో కొద్ది రోజుల పాటు కాల్పుల విరమణను పుతిన్ సూచించారని, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడవచ్చని ట్రంప్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..


రష్యాలో మరో ఆయిల్ కేంద్రంపై దాడి.. డ్రోన్ శక్తిని చూపిస్తున్న ఉక్రెయిన్..

Updated Date - Apr 30 , 2026 | 12:54 PM