Share News

రష్యాలో మరో ఆయిల్ కేంద్రంపై దాడి.. డ్రోన్ శక్తిని చూపిస్తున్న ఉక్రెయిన్..

ABN , Publish Date - Apr 30 , 2026 | 07:14 AM

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాడులు, ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రష్యాలోని మరో ముఖ్యమైన ఆయిల్ ఫెసిలిటీ భారీ అగ్నిప్రమాదానికి గురైంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులే ఈ ప్రమాదానికి కారణం.

రష్యాలో మరో ఆయిల్ కేంద్రంపై దాడి.. డ్రోన్ శక్తిని చూపిస్తున్న ఉక్రెయిన్..
Russia oil fire

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాడులు, ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రష్యాలోని మరో ముఖ్యమైన ఆయిల్ ఫెసిలిటీ భారీ అగ్నిప్రమాదానికి గురైంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులే ఈ ప్రమాదానికి కారణం. రష్యాలోని పెర్మ్ ప్రాంతంలో ఉన్న ఒక కీలక ఆయిల్ పంపింగ్ స్టేషన్‌పై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేసింది (Russia oil fire).


ఈ ప్రాంతం ఉక్రెయిన్ సరిహద్దు నుంచి సుమారు 1,500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దాడి ఉక్రెయిన్ డ్రోన్ సామర్థ్యం ఎంతగా పెరిగిందో చూపిస్తోంది. తమ దేశం జరిపిన సుదీర్ఘ డ్రోన్ దాడి ఇదేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. ఈ కేంద్రం రష్యా ఆయిల్ పంపిణీ వ్యవస్థలో కీలక భాగం కావడంతో, అగ్నిప్రమాదం పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో రష్యా ఆయిల్ రంగాన్ని ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడులు చేస్తోంది. రిఫైనరీలు, నిల్వ కేంద్రాలు, పోర్టులు.. ఇలా కీలక ఇంధన మౌలిక సదుపాయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి (Ukraine drone attack).


కాగా, మరోవైపు ఉక్రెయిన్ పౌర ప్రాంతాలపై రష్యా దాడులు చేస్తోంది (Russia Ukraine war). ఈశాన్య ఖర్కివ్ ప్రాంతంపై జరిపిన దాడుల్లో 8 మంది గాయపడ్డారని రష్యా అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ నుంచి భారీ సంఖ్యలో వస్తున్న డ్రోన్లను అడ్డుకున్నామని పేర్కొన్నారు. కాగా, పెర్మ్ చమురు కేంద్రంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి గురించి రష్యా ఇప్పటివరకు స్పందించలేదు.


ఈ వార్తలు కూడా చదవండి:

అనంతపురం మీదుగా తిరుపతికి రైలు

రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..

Updated Date - Apr 30 , 2026 | 07:50 AM