అనంతపురం మీదుగా తిరుపతికి రైలు
ABN , Publish Date - Apr 29 , 2026 | 11:49 AM
ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా తిరుపతి-అకోలా మధ్య రెగ్యులర్ బేసిస్‌పై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
గుంతకల్లు(అనంతపురం): ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా తిరుపతి-అకోలా మధ్య రెగ్యులర్ బేసిస్‌పై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అకోలా-తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17430) మే 3వ తేదీ నుంచి శుక్రవారాలలో ఉదయం 9-15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఎనిమిదిన్నరకు తిరుపతికి చేరుతుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (17429) మే 8వ తేదీ నుంచి ఆదివారాలలో మధ్యాహ్నం 12-25 గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు అకోలాకు చేరుతుందన్నారు.
ఈ రైలు తిరుపతి, పాకాల, పీలేరు, మదనపల్లె రోడ్డు, ములకలచెరువు, కదిరి, ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూలు సిటీ, గద్వాల, వనపర్తి రోడ్డు, మహబూబ్‌నగర్, కాచిగూడ, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, నాందేడ్, పూర్ణా, బస్మత్, హింగోలి దక్కన్, వాసిం మీదగా అకోలాకు చేరుకుంటుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..
రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..
Read Latest Telangana News and National News