రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..
ABN , Publish Date - Apr 29 , 2026 | 10:06 AM
రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భర్తతో పాటు బాత్‌రూము దగ్గర కూర్చున్న ఆమెను ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
పల్నాడు, ఏప్రిల్ 29: విశాఖ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో దారుణం చోటుచేసుకుంది. రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భర్తతో పాటు బాత్‌రూము దగ్గర కూర్చున్న ఆమెను ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తన ఫిర్యాదులో పోలీసులకు తెలిపిన వివరాల మేరకు.. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన భార్యాభర్తలు ఉపాధి నిమిత్తం విశాఖపట్నంలో స్థిరపడ్డారు. గత ఆదివారం సాయంత్రం సొంతూరుకు వెళ్లేందుకు విశాఖ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎక్కారు.
జనరల్ బోగీలో బాగా రద్దీగా ఉండటంతో దంపతులిద్దరూ బాత్‌రూము దగ్గర కూర్చున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ యువకుడు బాధితురాలితో మాటలు కలిపాడు. ఏసీ కోచ్‌లో సీట్లు ఖాళీగా ఉంటాయని చెప్పి ఆమెను నమ్మించి తీసుకెళ్లాడు. ఏసీ కోచ్‌లోకి వెళ్లిన తర్వాత ఎవ్వరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు తెలిస్తే గొడవలు జరుగుతాయనే భయంతో బాధితురాలు భర్తకు చెప్పలేదు.
మంగళవారం బాధితురాలు పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసుల సహాయంతో నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
ఈ-సిగరెట్ కాలుస్తూ కెమెరాకు చిక్కిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్
బెంగళూరులో శ్రీహరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు