ఈ-సిగరెట్ కాలుస్తూ కెమెరాకు చిక్కిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్
ABN , Publish Date - Apr 29 , 2026 | 09:48 AM
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ విజయాల పరంపరకు రాజస్థాన్ రాయల్స్ బ్రేకులు వేసింది. ముల్లాన్‌పుర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది. ఇదే సమయంలో ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ చిక్కుల్లో పడ్డాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ విజయాల పరంపరకు రాజస్థాన్ రాయల్స్ బ్రేకులు వేసింది. ముల్లాన్‌పుర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది. ఇదే సమయంలో ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ చిక్కుల్లో పడ్డాడు. అతడు డ్రెస్సింగ్ రూమ్‌లో చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. లైవ్ టీవీ కెమెరాలకు రియాన్ పరాగ్ ఈ-సిగరెట్ కాలుస్తూ అడ్డంగా దొరికిపోయాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతోన్నాయి.
నిన్న(మంగళవారం) చండీగఢ్‌లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ 16వ ఓవర్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఛేజింగ్‌లో కీలక దశలో 16 బంతుల్లో 29 పరుగులు చేసి పరాగ్ ఔటైన కొద్దిసేపటికే బ్రాడ్‌కాస్ట్ కెమెరాలో అతడు వేపింగ్ చేస్తున్నట్లు కనిపించే దృశ్యాలు రికార్డయ్యాయి. స్టేడియంలలో ఆటగాళ్ల ప్రవర్తనపై బీసీసీఐకి కఠినమైన నిబంధనలు ఉన్నాయి. డ్రెస్సింగ్ రూమ్ లేదా డగౌట్‌లో పొగాకు, సంబంధిత ఉత్పత్తుల వాడకంపై నిషేధం అమల్లో ఉంది. అసలు నిషేధిత వస్తువు డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఎలా వచ్చిందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
దీనిపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉందని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. యువతకు రోల్ మోడల్‌గా ఉండాల్సిన క్రికెటర్లు ఇలా బహిరంగంగా ధూమపానం చేయడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని పలువురు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటివి వాడటం క్రమశిక్షణారాహిత్యం కిందకు వస్తుంది. పరాగ్‌పై భారీ జరిమానాతో పాటు కొన్ని మ్యాచ్‌ల నిషేధం కూడా పడే ఛాన్స్ ఉంది. ఇటీవలే డగౌట్‌లో మొబైల్ ఫోన్ వాడినందుకు రాజస్థాన్ టీమ్ మేనేజర్‌కు బీసీసీఐ జరిమానా విధించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ఆ ఇద్దరి వల్లే ఈ విజయం: రియాన్ పరాగ్
పీఎస్‌ఎల్‌లో ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పిన బాబర్