Share News

పీఎస్‌ఎల్‌లో ఆల్‌టైమ్‌ రికార్డు నెలకొల్పిన బాబర్

ABN , Publish Date - Apr 29 , 2026 | 07:50 AM

కొన్నాళ్ల క్రితం వరకు ఫామ్‌ కోల్పోయి విమర్శలు ఎదుర్కొన్న పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్ ప్రస్తుతం అద్భుత ప్రదర్శన ఇస్తున్నాడు. తాజాగా పీఎస్ఎల్ చరిత్రలోనే ఓ ఆల్ టైమ్ రికార్డును బాబర్ నెలకొల్పాడు.

పీఎస్‌ఎల్‌లో ఆల్‌టైమ్‌ రికార్డు నెలకొల్పిన బాబర్
Babar Azam

స్పోర్ట్స్ డెస్క్: కొన్నాళ్ల క్రితం వరకు ఫామ్‌ కోల్పోయి విమర్శలు ఎదుర్కొన్న పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్ ప్రస్తుతం అద్భుత ప్రదర్శన ఇస్తున్నాడు. పాకిస్థాన్ సూపర్‌ లీగ్‌ 2026లో పెషావర్‌ జల్మీ కెప్టెన్‌‌గా వ్యవహరిస్తున్న బాబర్‌ పరుగులు సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే ఓ శతకాలు, 3 అర్ద సెంచరీలు చేసిన అతను.. తాజాగా మరో సెంచరీ బాదాడు.


నిన్న(మంగళవారం)ఇస్లామాబాద్‌ యునైటెడ్‌తో జరుగుతున్న క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో బాబర్‌ సునామీ సృష్టించాడు. కేవలం 59 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక బాబర్ విధ్వంసకర శతకం ఫలితంగా పెషావర్‌ జల్మీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం 222 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ జట్టు 151 పరుగులకే ఆలౌటైంది. దీంతో 70 పరుగుల భారీ తేడాతో షెషావర్ విజయం సాధించగా.. బాబర్ ఆజమ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.


ఇదిలా ఉంటే, ఈ సెంచరీతో బాబర్‌ పీఎస్‌ఎల్‌లో ఓ ఆల్‌టైమ్‌ రికార్డును నెలకొల్పాడు. ఈ లీగ్ చరిత్రలో నాలుగు సీజన్లలో 500 ప్లస్‌ పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అతడు 2021, 2023, 2024, 2026 సీజన్లలో 500పై పరుగులు సాధించాడు. బాబర్‌ తర్వాతి స్థానంలో మహ్మద్‌ రిజ్వాన్‌ ఉన్నాడు. రిజ్వాన్‌ పీఎస్‌ఎల్‌లో మూడు సీజన్లలో 500 ప్లస్‌ పరుగులు సాధించాడు. పీఎస్ఎల్ 2026లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన బాబర్‌ 598 పరుగులు చేసి, పీఎస్‌ఎల్‌ చరిత్రలో ఓ సింగిల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు ఫకర్‌ జమాన్‌ పేరిట ఉండేది. జమాన్‌ 2022 సీజన్‌లో 588 పరుగులు చేశాడు.


ఇవి కూడా చదవండి:

పంజాబ్‌కు తొలి ఝలక్‌

కాంప్లిమెంటరీ పాసులు ఎందుకు

Updated Date - Apr 29 , 2026 | 07:58 AM