Share News

బెంగాల్‌లో తుది దశ పోలింగ్ ప్రారంభం.. ఆ నియోజకవర్గం పైనే అందరి దృష్టి..

ABN , Publish Date - Apr 29 , 2026 | 07:49 AM

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తుది దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో బెంగాల్ వ్యాప్తంగా మొత్తం 142 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 41,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది.

బెంగాల్‌లో తుది దశ పోలింగ్ ప్రారంభం.. ఆ నియోజకవర్గం పైనే అందరి దృష్టి..
West Bengal Election 2026

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తుది దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో బెంగాల్ వ్యాప్తంగా మొత్తం 142 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 41,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 1,448 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు (West Bengal Election 2026).


ముఖ్యంగా భవానీపూర్ నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. ఇక, మమతకు పోటీగా బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి కూడా ఇదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతపై సువేందు గెలుపొందించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో వీరిద్దరూ భవానీపూర్ వేదికగా తలపడుతున్నారు (Mamata Banerjee vs Suvendu Adhikari).


కాగా, సువేందు భవానీపూర్‌తో పాటు నందిగ్రామ్ నుంచి కూడా బరిలోకి దిగుతున్నారు (TMC vs BJP). ఈ రెండు నియోజకవర్గాలకు ఈ దశలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. తుది ఫలితాలు మే 4న ప్రకటించనున్నారు. పోలింగ్ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు.


ఇవి కూడా చదవండి..

పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..


లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 8 మంది మృతి..

Updated Date - Apr 29 , 2026 | 09:00 AM