Share News

పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..

ABN , Publish Date - Apr 29 , 2026 | 06:28 AM

గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడం, డాలర్ బలపడడం వంటి కారణాలతో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. బుధవారం ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..
gold and silver rates today

గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడం, డాలర్ బలపడడం వంటి కారణాలతో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. భౌగోళిక, రాజకీయ కారణాలు కూడా బంగారం హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి (Gold and Silver Rates).


గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,50,920గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,38,340గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,51,070గా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,38,490గా ఉంది (Live Gold Rates).


మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుదలను నమోదు చేశాయి (Silver prices today). కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,64,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,59,900గా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.రూ.2,64,900గా, బెంగళూరులో రూ.రూ.2,59,900 ఉంది.

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఇవి కూడా చదవండి..

గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..

Updated Date - Apr 29 , 2026 | 06:38 AM