Share News

ఇరాన్‌.. పూర్తిగా పతన స్థితిలో ఉంది : డొనాల్డ్ ట్రంప్‌

ABN , Publish Date - Apr 29 , 2026 | 06:10 AM

ఇరాన్‌ పూర్తిగా పతన స్థితిలో ఉందని, హోర్ముజ్‌ జలసంధిని వెంటనే తెరవాలని కోరుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌...

ఇరాన్‌.. పూర్తిగా పతన స్థితిలో ఉంది : డొనాల్డ్ ట్రంప్‌

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 28: ఇరాన్‌ పూర్తిగా పతన స్థితిలో ఉందని, హోర్ముజ్‌ జలసంధిని వెంటనే తెరవాలని కోరుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్‌ సోషల్‌లో పోస్టు పెట్టారు. ‘‘తాము కుప్పకూలిపోయేలా ఉన్నామని కాసేపటి క్రితమే ఇరాన్‌ మాకు సమాచారం ఇచ్చింది. వారు తమ నాయకత్వంలో ఏర్పడిన విభేదాలను సరిచేసుకునే క్రమంలో ఉన్నారు. వీలైనంత త్వరగా హోర్ముజ్‌ జలసంధిని తెరవాలని కోరుకుంటున్నారు’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికాతో చర్చల విషయంగా ఇరాన్‌ పాలకులు, రెవెల్యూషనరీ గార్డ్స్‌ మధ్య విభేదాలు తలెత్తినట్టుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..

Updated Date - Apr 29 , 2026 | 06:22 AM