గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Apr 28 , 2026 | 10:17 AM
డాలర్ కాస్త బలపడడం, గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో మంగళవారం బంగారం ధర తగ్గుదల నమోదు చేసింది. భౌగోళిక, అంతర్జాతీయ రాజకీయ కారణాలతో కాస్త హెచ్చుతగ్గులకు లోనవుతోంది.
డాలర్ కాస్త బలపడడం, గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో మంగళవారం బంగారం ధర తగ్గుదల నమోదు చేసింది. భౌగోళిక, అంతర్జాతీయ రాజకీయ కారణాలతో కాస్త హెచ్చుతగ్గులకు లోనవుతోంది. మంగళవారం ఉదయం పది గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.710 మేర తగ్గుదల నమోదు చేసింది (Gold and Silver Rates).
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,53,000గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,40,250గా ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.650 మేర తగ్గింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,53,150గా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,40,400గా ఉంది.(Live Gold Rates).
మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుదలను నమోదు చేశాయి (Silver prices today). కిలోకు 4 వేల రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2.65 లక్షలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.6 లక్షలుగా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2.65 లక్షలుగా, బెంగళూరులో రూ.2.60 లక్షలుగా ఉంది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి..
న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..
బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..