లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 8 మంది మృతి..
ABN , Publish Date - Apr 29 , 2026 | 07:28 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. లెబనాన్ దక్షిణ ప్రాంతంలో ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ ఈ దాడులు నిర్వహించడం పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. లెబనాన్ దక్షిణ ప్రాంతంలో ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ ఈ దాడులు నిర్వహించడం పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చింది. ఈ దాడుల్లో మృతుల వివరాలను లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది (Israel Iran war).
మజ్దల్ జౌన్ పట్టణంపై జరిగిన దాడిలో మొదట ఐదుగురు మరణించగా, తరువాత మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ ఘటనలో సివిల్ డిఫెన్స్ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఇద్దరు సైనికులు గాయపడినట్టు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది (Lebanon airstrikes).
కాగా, హెజ్‌బొల్లా మిలిటెంట్లు ఉపయోగిస్తున్న ఒక పెద్ద టన్నెల్ నెట్‌వర్క్‌ను గుర్తించి ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది (Hezbollah tunnels). ఈ టన్నెల్‌ను వ్యూహాత్మక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. మార్చి ప్రారంభం నుంచి ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 17న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, ఈ దాడులు ఆగడం లేదు.
ఇవి కూడా చదవండి..
గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..