Share News

పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..

ABN , Publish Date - Mar 05 , 2026 | 07:10 AM

నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,64, 510 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,50,800 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 1,23,380 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.

పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..
Gold price trend 2026

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ ప్రభావం అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్‌పై తీవ్రంగా పడుతోంది. యుద్ధం కారణంగా ఒక్కసారిగా భారీగా పెరిగిన బంగారం ధరలు నిన్నటి నుంచి తగ్గుతున్నాయి. హైదరాబాద్ నగరంలో నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,64, 510 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,50,800 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 1,23,380 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,64, 500 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,50, 790 దగ్గర ట్రేడ్ అవుతోంది..10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 1,23,370 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.


వెండి ధరలు ఇలా..

నిన్న హైదరాబాద్ మహా నగరంలో కేజీ వెండి ధర 2,95,000 దగ్గర ట్రేడ్ అయింది. 100 గ్రాముల వెండి ధర 29,500 దగ్గర ట్రేడ్ అయింది. బంగారం ధరలతో పాటే వెండి ధరలు కూడా నిన్నటి నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు కేజీపై 100 రూపాయలు, 100 గ్రాములపై పది రూపాయలు తగ్గింది. నేడు కేజీ వెండి ధర 2,94,900 దగ్గర ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల వెండి ధర 29,490 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.


దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (24 క్యారెట్లు ఒక గ్రాముకు.. అంచనా)

  • హైదరాబాద్: 16,450

  • విజయవాడ: 16,451

  • ఢిల్లీ: 16,466

  • ముంబై: 16,450

  • కోల్‌కతా: 16,450

  • చెన్నై: 16,582

  • బెంగళూరు: 16,451

  • కేరళ: 16,761

  • పుణే: 16,761

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి

ప్రభుత్వానికి తలనొప్పిగా టీడీఆర్‌ బాండ్‌ల వ్యవహారం

విశాఖ నిల్వకేంద్రంలో నిండుగా చమురు

Updated Date - Mar 05 , 2026 | 08:06 AM