Home » Lebanon
దక్షిణ లెబనాన్‌లో భయానక సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ రిపోర్టర్ లైవ్ రిపోర్టింగ్ కోసం సిద్ధమవుతుండగా.. అతడికి కొద్దిదూరంలోనే భారీ పేలుడు సంభవించింది. దీంతో రిపోర్టర్‌తో పాటు కెమెరామ్యాన్‌కు గాయాలు అయ్యాయి.
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని హెజ్‌బొల్లా మరోసారి తిరస్కరించింది. ఆ ఒప్పందం తమకు ఆమోదయోగ్యంగా లేదని స్పష్టం చేసింది.
పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతల స్థాపన దిశగా ఒక చరిత్రాత్మక ముందడుగు పడింది. దశాబ్దాలుగా తీవ్ర ఉద్రిక్తతలు, ఘర్షణలతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో ఒక కీలకమైన 'ప్రాథమిక ఒప్పందం' కుదిరింది.
ఇజ్రాయెల్ తన ఆదేశాలను పాటిస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఘాటుగా స్పందించారు. తామిద్దరం ఒకరి ఆదేశాలను మరొకరు పాటించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
దక్షిణ లెబనాన్‌లోని ఓ పర్వతం కింద హెజ్‌బొల్లాకు చెందిన ఒక భారీ భూగర్భ డ్రోన్ కేంద్రాన్ని ఇజ్రాయెల్ దళాలు కనుగొన్నాయి. ఇందులో భారీ ఆయుధ సంపత్తి ఉంది. గతంలో కనుగొన్న ఇతర హెజ్‌బొల్లా సొరంగాల కంటే ఇది చాలా అత్యాధునికమైందని సమాచారం.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుండడం ఉద్రిక్తతలను రేకెత్తిస్తోంది. దీంతో కీలకమైన హోర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్టు ఇరాన్ ప్రకటించింది.
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడటం కలకలం రేపుతోంది. పశ్చిమాసియాలో శాంతి వాతావరణం నెలకొనాల్సిన నేపథ్యంలో తాజా ఘటనతో మరోసారి ఉద్రిక్తతలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక కీలక దౌత్యపరమైన ముందడుగు పడింది. వాషింగ్టన్‌లో జరిగిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం, ఇజ్రాయెల్, లెబనాన్ ప్రభుత్వాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. లెబనాన్ దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 31 మంది మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 45 రోజుల పాటు పొడిగించారు. వాషింగ్టన్‌లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.