Share News

'ఆయన చెప్పినట్లు నేను వినను..' ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన నెతన్యాహు

ABN , Publish Date - Jun 22 , 2026 | 07:56 PM

ఇజ్రాయెల్ తన ఆదేశాలను పాటిస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఘాటుగా స్పందించారు. తామిద్దరం ఒకరి ఆదేశాలను మరొకరు పాటించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

'ఆయన చెప్పినట్లు నేను వినను..' ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన నెతన్యాహు
Netanyahu Rejects Trump's Claim That Israel Follows His Orders, Stresses Independent Leadership

టెల్ అవీవ్ (ఇజ్రాయెల్), జూన్ 22: పశ్చిమాసియా వ్యవహారాల్లో ఇజ్రాయెల్ తన ఆదేశాలను పాటిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘాటుగా స్పందించారు. తామిద్దరం ఒకరి ఆదేశాలను మరొకరు పాటించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. జెరూసలేం న్యూస్ సిండికేట్ అంతర్జాతీయ విధాన సదస్సు 2026లో నెతన్యాహు మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

'అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేనేది చెబితే అది చేయరు, అలాగే ఆయన చెప్పినవన్నీ నేను చేయను. మేమిద్దరం స్వతంత్ర, గర్వించదగ్గ దేశాలకు నాయకులం. కొన్ని విషయాల్లో మా మధ్య ఒకే రకమైన అభిప్రాయాలు ఉండకపోవచ్చు. నేను ఇజ్రాయెల్ ప్రయోజనాలు, భద్రత కోసం నిలబడతాను. కొన్నిసార్లు మా ఆలోచనలు కలవకపోయినా, ఒకరి సార్వభౌమత్వాన్ని, నాయకత్వాన్ని మరొకరం గౌరవించుకుంటాం' అని నెతన్యాహు పేర్కొన్నారు.


Israel.jpgవివాదానికి కారణమైన ట్రంప్ వ్యాఖ్యలు

గత శుక్రవారం 'ఆక్సియోస్'(Axios)మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. లెబనాన్‌పై దాడులను ఆపేలా ఇజ్రాయెల్ సైనిక చర్యలను మీరు ప్రభావితం చేయగలరా? అన్న ప్రశ్నకు సమాధానంగా.. 'అవును, నేను చేయగలను. వారికి నాపై చాలా గౌరవం ఉంది. నేను చెప్పినట్లే వారు వింటారు' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. నెతన్యాహుతో తనకున్న సంబంధాలు బాగున్నాయని చెబుతూనే, కొన్నిసార్లు ఆయనను 'కట్టడి చేయాల్సి వస్తుందని' అమెరికా మద్దతు లేకపోతే ఇజ్రాయెల్ ఉనికిలోనే ఉండేది కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనికి సమాధానంగా నెతన్యాహు ఇప్పుడు పై విధంగా స్పందించారు.


ఇవి కూడా చదవండి..

‘నా భర్త అన్ని లిమిట్స్ క్రాస్ చేశాడు’.. టెకీ రాధాగాయత్రి చివరి ఆడియో

ఆధ్యాత్మిక, సనాతన పరిరక్షణ కేంద్రాలుగా ఆలయాలు: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 22 , 2026 | 08:31 PM