‘నా భర్త అన్ని లిమిట్స్ క్రాస్ చేశాడు’.. టెకీ రాధాగాయత్రి చివరి ఆడియో
ABN , Publish Date - Jun 22 , 2026 | 11:45 AM
విశాఖకు చెందిన టెకీ రాధాగాయత్రి చివరి ఆడియో వెలుగులోకి వచ్చింది. భర్త ప్రవర్తనపై గాయత్రి తన తల్లితో చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసింది. భర్తతో కలిసి ఉత్తరాఖండ్ వెళ్లిన రాధాగాయత్రి అక్కడి హోమ్‌స్టేలో మృతిచెందిన విషయం తెలిసిందే.
విశాఖపట్నం, జూన్ 22: విశాఖకు చెందిన టెకీ రాధాగాయత్రి మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. భర్తతో కలిసి ఉత్తరాఖండ్ వెళ్లిన రాధాగాయత్రి అక్కడి హోమ్‌స్టేలో మృతిచెందిన విషయం తెలిసిందే. మొదట అనుమానాస్పద కేసుగా నమోదు అయినప్పటికీ.. గాయత్రి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త శ్రీచరణ్‌పై ముస్సోరి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తాజాగా రాధాగాయత్రికి చెందిన చివరి ఆడియో వెలుగులోకి వచ్చింది. భర్త ప్రవర్తనపై గాయత్రి తన తల్లితో చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసింది.
నా మనసు విరిగిపోయింది: ఫోన్‌లో గాయత్రి
‘నా మనసు పూర్తిగా విరిగిపోయింది. నా మీద అనుమానం, నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడు. నేనేదైనా తప్పు చేస్తే నేరుగా అడగమని మా అత్తయ్యతో అన్నాను. నేను ఇక నా భర్తతో మాట్లాడదలుచుకోవడం లేదు. ఏదైనా ఉంటే మా అమ్మవాళ్లతో మాట్లాడమని చెప్పా. ఇన్నాళ్లూ ఓపిక పట్టాను. నా భర్త అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయాడు’ అని ఫోన్‌లో రాధాగాయత్రి చెబుతున్నట్లు ఆడియోలో ఉంది. తల్లితో గాయత్రి ఫోన్ సంభాషణ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి..
తిరుపతి రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి
న్యాయం చేయండి.. పల్లా శ్రీనివాస్‌ను కలిసిన టెకీ గాయత్రి తల్లి
Read Latest AP News And Telugu News