Share News

న్యాయం చేయండి.. పల్లా శ్రీనివాస్‌ను కలిసిన టెకీ గాయత్రి తల్లి

ABN , Publish Date - Jun 22 , 2026 | 10:10 AM

విశాఖకు చెందిన టెకీ రాధా గాయత్రి మృతి కేసులో న్యాయం కోసం కుటుంబసభ్యులు పోరాడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ రావును గాయత్రి తల్లి సత్యవతి కలిశారు.

న్యాయం చేయండి.. పల్లా శ్రీనివాస్‌ను కలిసిన టెకీ గాయత్రి తల్లి
Visakha Techie Case

విశాఖపట్నం, జూన్ 22: విశాఖకు చెందిన టెకీ రాధా గాయత్రి మృతి కేసులో న్యాయం కోసం కుటుంబసభ్యులు పోరాడుతున్నారు. ఈరోజు(సోమవారం) ఉదయం టీడీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ రావును గాయత్రి తల్లి సత్యవతి కలిశారు. ఈ సందర్భంగా రాధా గాయత్రి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఓదార్చారు. తమకు న్యాయం చేయాలని, కూతురి మృతికి కారణమైన దోషులను శిక్షించాలని తల్లి, బంధువులు కోరారు. ఈ కేసు విషయంపై హోం మంత్రి వంగలపూడి అనితతో పల్లా శ్రీనివాస్ ఫోన్‌లో మాట్లాడారు.


రాధా గాయత్రి హత్య కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహాకారం అందిస్తామని పల్లా తెలిపారు. టెకీ గాయత్రి హత్య ముస్సోరిలో జరగటంతో కేసు తుది విచారణ హక్కు అక్కడి పోలీసులకే ఉంటుందన్నారు. రాధా గాయత్రి కుటుంబానికి అండగా ఉంటామని పల్లా శ్రీనివాస్ రావు హామీ ఇచ్చారు.


భర్త శ్రీచరణ్‌తో కలిసి ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీకి వెళ్లిన గాయత్రి ఈనెల 14న అక్కడి హోమ్‌స్టేలో మృతిచెందిన విషయం తెలిసిందే. గాయత్రి ముక్కు నుంచి రక్తం వచ్చినట్లు గుర్తించిన ముస్సోరి పోలీసులు తొలుత అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. అయితే గాయత్రి తండ్రి ఫిర్యాదుతో భర్త శ్రీచరణ్‌పై అక్కడి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.


ఇవి కూడా చదవండి..

కడపలో విషాదం.. ఇసుక క్వారీ గుంతలో పడి అన్నదమ్ముల దుర్మరణం

తిరుపతి రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 22 , 2026 | 10:14 AM