Share News

తిరుపతి రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి

ABN , Publish Date - Jun 22 , 2026 | 09:45 AM

తిరుపతి - కడప సూపర్ లగ్జరీ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన చిన్నారి పునీత్ సాయి, విద్యార్థిని యశ్విత కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తిరుపతి రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి
Mandipalli Ramprasad Reddy

అమరావతి, జూన్ 22: తిరుపతి - కడప సూపర్ లగ్జరీ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన చిన్నారి పునీత్ సాయి, విద్యార్థిని యశ్విత కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. తీవ్రగాయాలైన వారికి మెరుగైన వైద్యం కోసం ఉన్నత వైద్య కేంద్రాలకు తరలించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. రోడ్డు భద్రతా ప్రమాణాలు, బస్సు - లారీ వివరాలపై ఫోన్లో అధికారులతో మంత్రి మాట్లాడారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. ప్రమాదంలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు.


మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండ: మంత్రి అనగాని

తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల మంత్రి అనగాని సత్యప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు అందుతున్న చికిత్సపై అధికారులతో ఆరా తీశారు. తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ హామీ ఇచ్చారు.


తిరుపతి జిల్లా పుల్లంపేట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

నెల్లూరు ఏఎస్‌పేట దర్గా వివాదం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.. వక్ఫ్‌కు లేఖ

కడపలో విషాదం.. ఇసుక క్వారీ గుంతలో పడి అన్నదమ్ముల దుర్మరణం

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 22 , 2026 | 10:38 AM