Share News

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. హోర్ముజ్‌ను మూసేస్తున్నామని ఇరాన్ ప్రకటన..

ABN , Publish Date - Jun 20 , 2026 | 08:05 PM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుండడం ఉద్రిక్తతలను రేకెత్తిస్తోంది. దీంతో కీలకమైన హోర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్టు ఇరాన్ ప్రకటించింది.

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. హోర్ముజ్‌ను మూసేస్తున్నామని ఇరాన్ ప్రకటన..
Iran Strait of Hormuz

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుండడం ఉద్రిక్తతలను రేకెత్తిస్తోంది. దీంతో కీలకమైన హోర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్టు ఇరాన్ ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఆ జలమార్గం తెరిచే ఉందని, నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు (Iran Strait of Hormuz).


లెబనాన్‌లోని నబతియెహ్‌లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్లతో దాడులకు దిగింది. ఈ ఘటనలో అనేక నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ వైమానిక, డ్రోన్ దాడుల్లో కనీసం ఐదుగురు మృతిచెందగా, పలువురు గాయపడినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇది తమ తొలి ప్రతిస్పందన మాత్రమేనని, అవసరమైతే మరిన్ని చర్యలు ఉంటాయని ఇరాన్ సైనిక నాయకత్వం హెచ్చరించింది (Hormuz Closure Threat).


హోర్ముజ్ జలసంధిని అన్ని రకాల నౌకా రవాణాకు మూసివేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది (Israel Lebanon Conflict). ఈ జలమార్గం వైపు నౌకలు రాకూడదని హెచ్చరించింది. కాగా, ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో స్పందించిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్టు ఎలాంటి ఆధారాలూ లేవని తెలిపారు. చమురు రవాణా యథావిధిగా కొనసాగుతోందని, పరిస్థితిని అమెరికా నిశితంగా గమనిస్తోందని చెప్పారు. అలాగే ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

వైరల్ వీడియో.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన చిన్నారి..


ఇదీ జెన్ జీ పవర్.. చెత్తకుప్పలా మారిన నదికి 50 రోజుల్లో జీవం పోశారు..

Updated Date - Jun 20 , 2026 | 08:07 PM