ఇదీ జెన్ జీ పవర్.. చెత్తకుప్పలా మారిన నదికి 50 రోజుల్లో జీవం పోశారు..
ABN , Publish Date - Jun 20 , 2026 | 03:55 PM
యువత తలచుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐదుగురు యువకులు చేసిన పని దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. వారి కృషిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
యువత తలచుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐదుగురు యువకులు చేసిన పని దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ప్రభుత్వ సహాయం లేకుండా, ఎలాంటి భారీ వనరులనూ సమీకరించకుండా ఐదుగురు యువకులు 50 రోజుల పాటు శ్రమించి ఒక నదిని పూర్తిగా శుభ్రం చేశారు. వారి కృషిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు (Gen Z River Cleaning).
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో లజ్ఘాటా గ్రామం సమీపంలోని మనోరమా నది ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తతో నిండిపోయి దుర్వాసన వెదజల్లేది. నది దగ్గరకు గ్రామ ప్రజలు వెళ్లేవారు కాదు. జంతువులు కూడా ఆ నదిలో నీళ్లు తాగడానికి ఇష్టపడేవి కావు. అలాంటి సమయంలో గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు నదిని శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రతిరోజూ నదిలోకి దిగి ప్లాస్టిక్, చెత్త, కలుపు మొక్కలను తొలగించారు. దాదాపు 50 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో వందల కిలోల వ్యర్థాలను తొలగించారు (Uttar Pradesh Youth Environmental Awareness).
ఈ ఐదుగురు యువకులు ఆ నది నుంచి 50 రోజుల్లో 700 కిలోల వ్యర్థాలను తొలగించారు (Viral Video). యువకుల కృషి ఫలితంగా నది రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు చెత్తతో నిండిపోయిన నది ఇప్పుడు స్వచ్ఛంగా ప్రవహిస్తోంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది విపరీతంగా వైరల్ అవుతోంది. 'దేశాన్ని మార్చాలంటే ఇలాంటి యువత అవసరం', 'ఫిర్యాదులు చేయడం మాని పరిష్కారం చూపించారు' అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య దూరం!
ఫిఫా ప్రపంచ కప్2026: మెస్సిపై ఫిఫాకు అల్జీరియా ఫిర్యాదు