Share News

వైరల్ వీడియో.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన చిన్నారి..

ABN , Publish Date - Jun 20 , 2026 | 03:03 PM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే కొన్ని వీడియోలు చూసిన తర్వాత గుండె ఒక్కసారిగా ఆగినంత పని అవుతుంది. తాజాగా అలాంటి ఓ వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది.

వైరల్ వీడియో.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన చిన్నారి..
Little Girl Accident Video

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే కొన్ని వీడియోలు చూసిన తర్వాత గుండె ఒక్కసారిగా ఆగినంత పని అవుతుంది. తాజాగా అలాంటి ఓ వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. రోడ్డుపై జరిగిన ఈ ఘటనలో ఓ చిన్నారి త్రుటిలో ప్రాణాలను దక్కించుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి (Little Girl Accident Video).


కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మూడు సంవత్సరాల చిన్నారి ఆటో నుంచి దిగిన వెంటనే రోడ్డుకు అవతల వైపు ఉన్న తన తల్లి వద్దకు వెళ్లేందుకు ఒక్కసారిగా పరుగెత్తింది. అదే సమయంలో రోడ్డుపై ఓ ప్రైవేట్ బస్సు వేగంగా వస్తోంది. చిన్నారి నేరుగా బస్సు ముందుకు వెళ్లడంతో అక్కడి వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు (Kerala Viral Video).


బాలిక బస్సు ముందుకు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే చాకచక్యంగా స్పందించాడు (Child Accident Escape). క్షణాల్లోనే బ్రేకులు వేయడంతో పాటు బస్సును పక్కకు మళ్లించాడు. దీంతో చిన్నారి బస్సు కింద పడకుండా తప్పించుకుంది. కొన్ని సెకన్ల ఆలస్యం జరిగినా పెద్ద ప్రమాదం సంభవించేది. ఈ మొత్తం ఘటన సమీపంలోని ఓ దుకాణం వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి..

యోగా ఫర్ హెల్తీ ఏజింగ్‌’ పేరుతో యోగా దినోత్సవం: రామ్‌దేవ్ బాబా

యోగా మన సంప్రదాయం, విజ్ఞానం, వారసత్వ సంపద: సీఎం చంద్రబాబు

Updated Date - Jun 20 , 2026 | 03:15 PM