Share News

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 20 , 2026 | 11:54 AM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. జర్నలిజంలో రాధాకృష్ణ ప్రస్థానం ఎందరికో ఆదర్శమని కొనియాడారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
CM Chandrababu

అమరావతి, జూన్ 20: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) వేమూరి రాధాకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం విషెస్ తెలిపారు. జర్నలిజంలో రాధాకృష్ణ ప్రస్థానం ఎందరికో ఆదర్శమని కొనియాడారు. రాధాకృష్ణ మరెన్నో విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.


‘ప్రతి అక్షరం ప్రజల పక్షం. పాత్రికేయంతో సమాజహితం సిద్ధాంతంగా నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు మీడియా రంగంలో తనదైన ముద్ర వేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్‌ను విజయవంతంగా నడిపిస్తూ, నిజాలను నిర్భయంగా ప్రజల ముందుంచే జర్నలిజం ఆయనది. ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’, ‘కొత్తపలుకు’ వంటి వేదికల ద్వారా సమకాలిన అంశాలపై ప్రజలను ఆలోచింపజేస్తారు. జర్నలిజంలో రాధాకృష్ణ ప్రస్థానం ఎందరికో ఆదర్శం. ఆయన ఆయురారోగ్యాలతో, ఆనందంగా, మరెన్నో విజయాలు సాధిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.


హ్యాపీ బర్త్‌ డే ఆర్కే సార్: మంత్రి లోకేశ్

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణకు ఏపీ మంత్రి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజాపక్షమైన అక్షరం ఆంధ్రజ్యోతి దినపత్రిక, నిజాన్ని నిర్భీతిగా ప్రసారం చేసే దమ్మున్న ఛానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు. దశాబ్దాలుగా జనం కోసం, సమాజం కోసం జర్నలిజాన్ని నిలిపిన ఓపెన్ హార్ట్ రాధాకృష్ణ ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవనం సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌ డే ఆర్కే సార్’ సోషల్ మీడియా ఎక్స్‌‌లో లోకేశ్ పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

యోగా ఫర్ హెల్తీ ఏజింగ్‌’ పేరుతో యోగా దినోత్సవం: రామ్‌దేవ్ బాబా

యోగా మన సంప్రదాయం, విజ్ఞానం, వారసత్వ సంపద: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 20 , 2026 | 12:14 PM