Share News

నేడు రాష్ట్రపతి పుట్టినరోజు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ విషెస్

ABN , Publish Date - Jun 20 , 2026 | 10:42 AM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బర్త్‌ డే విషెస్ తెలియజేశారు.

నేడు రాష్ట్రపతి పుట్టినరోజు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ విషెస్
Droupadi Murmu Birthday

అమరావతి, జూన్ 20: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బర్త్‌ డే విషెస్ తెలియజేశారు. దేశానికి ద్రౌపది ముర్ము అందిస్తున్న సేవల్లో విజయం సాధించాలని సీఎం ఆకాంక్షించగా, నాయకులు కావాలనుకునే ప్రతి ఒక్కరికీ రాష్ట్రపతి ముర్ము నిజమైన స్ఫూర్తిదాయకమని పవన్ అన్నారు.


చంద్రబాబు పోస్ట్..

‘భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు. ఆమె జీవితం, ప్రజాసేవ దేశవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ద్రౌపది ముర్ము మంచి ఆరోగ్యంతో ఉండాలని, దేశానికి ఆమె అందిస్తున్న గొప్ప సేవల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ చంద్రబాబు పోస్ట్ చేశారు.


ప్రజాసేవ శక్తికి నిదర్శనం ద్రౌపది ముర్ము: పవన్

‘రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. నగర్ పంచాయతీ కౌన్సిలర్‌గా సేవలందించడం నుంచి భారతదేశ ప్రథమ పౌరురాలిగా ఎదిగే వరకూ.. ఆమె సాగించిన అద్భుత ప్రయాణం, ప్రజాసేవకులు, నాయకులు కావాలనుకునే ప్రతి ఒక్కరికీ నిజమైన స్ఫూర్తిదాయకం. ఇది అట్టడుగు స్థాయి ప్రజాస్వామ్య బలానికి, అంకితభావంతో కూడిన ప్రజాసేవ శక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. దేశ సేవలో ఆమెకు మంచి ఆరోగ్యం, దృఢత్వం, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని జగన్నాథ స్వామిని ప్రార్థిస్తున్నాను’ అంటూ ఎక్స్‌లో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

అన్నదాత సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం: మంత్రి అచ్చెన్నాయుడు

‘యోగా ఫర్ హెల్తీ ఏజింగ్‌’ పేరుతో యోగా దినోత్సవం: రామ్‌దేవ్ బాబా

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 20 , 2026 | 11:26 AM