Share News

‘యోగా ఫర్ హెల్తీ ఏజింగ్‌’ పేరుతో యోగా దినోత్సవం: బాబా రామ్‌దేవ్

ABN , Publish Date - Jun 20 , 2026 | 10:07 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే విజన్ ఉన్న నాయకుడని యోగా గురు బాబా రామ్‌దేవ్ అన్నారు. యోగా మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమని తెలిపారు.

‘యోగా ఫర్ హెల్తీ ఏజింగ్‌’ పేరుతో యోగా దినోత్సవం: బాబా రామ్‌దేవ్
Ramdev baba

అమరావతి, జూన్ 20: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ‘యోగాంధ్ర’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలను చేపడుతోంది. ఈరోజు(శనివారం) ఉండవల్లి గుహల వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా గురు బాబా రామ్‌దేవ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగాసనాలు వేశారు. బాబా రామ్‌దేవ్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే విజన్ ఉన్న నాయకుడని అన్నారు. గత 30 సంవత్సరాలుగా చంద్రబాబు ఏం అడుగుతారో.. తాము అది చేస్తున్నామని తెలిపారు.


yoga1.jpg

యోగా మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమని బాబా రామ్‌దేవ్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు అందర్నీ సమానంగా చూస్తారని.. అందుకే ప్రజలు ఆయన్ను దేవుడిలా భావిస్తారన్నారు. అమరావతి దేవతల రాజధాని అని.. ఇక్కడ 40 శాతం పచ్చదనం, 60 శాతం నిర్మాణాలు ఉంటాయన్నారు. ఇది దేవ భూమి అని వెల్లడించారు. స్విట్జర్లాంట్ కోసం వెళ్లాల్సిన అవసరం లేదని... ఆంధ్రప్రదేశ్ వస్తే చాలని చెప్పారు. ఇక్కడి మామిడికాయలు, అరటిపండ్లు చాలా బాగుంటాయని.. ఎందుకంటే వాటిని సహజ సిద్ధంగా పండిస్తారని తెలిపారు. ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ‘యోగా ఫర్ హెల్తీ ఏజింగ్’ పేరుతో నిర్వహిస్తున్నామని బాబా రామ్‌దేవ్ పేర్కొన్నారు.

yoga5.jpgyoga2.jpgyoga6.jpg


ఇవి కూడా చదవండి..

అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ఉండవల్లిలో భారీ ఏర్పాట్లు

అన్నదాత సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం: మంత్రి అచ్చెన్నాయుడు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 20 , 2026 | 04:21 PM