భూపాలపల్లిలో ఉద్రిక్తత.. కవితను అడ్డుకున్న పోలీసులు
ABN , Publish Date - Jun 20 , 2026 | 09:35 AM
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కేటీకే-5 ఇంక్లైన్ గని వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు గని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి: సింగరేణి కేటీకే-5 ఇంక్లైన్ గని వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా 'తెలంగాణ రక్షణ సేన' (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేటీకే-5 ఇంక్లైన్ గనికి చేరుకున్నారు. అయితే గని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన కవితను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసులు, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కవితకు మద్దతుగా వచ్చిన నాయకులు మెయిన్ గేట్ ఎక్కేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత మరింత పెరిగింది. నిరసన మధ్య గేట్‌ను తొలగించడంతో కల్వకుంట్ల కవిత అనుచరులతో కలిసి గని ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఈ ఘటనతో గని పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Also Read:
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..
హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్