Share News

హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్

ABN , Publish Date - Jun 20 , 2026 | 07:25 AM

నిర్వహణ పనుల కారణంగా శనివారం ఉప్పల్‌ భగాయత్‌, ఐడీఏ ఉప్పల్‌ సబ్‌ స్టేషన్ల పరిధిలో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ బి.కిరణ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్
Hyderabad Power Cut Today

హైదరాబాద్: నిర్వహణ పనుల కారణంగా శనివారం ఉప్పల్‌ భగాయత్‌, ఐడీఏ ఉప్పల్‌ సబ్‌ స్టేషన్ల పరిధిలో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ బి.కిరణ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సత్యనగర్‌ ఫీడర్‌ పరిధిలోని సత్యనగర్‌ కాలనీ, న్యూ శాంతినగర్‌, ట్రైకలర్‌ అపార్ట్‌మెంట్స్‌, సాయిబాబా ఆలయ వీధి, వెంకటేశ్వర కాలనీ, ఆదిత్య ఆస్పత్రి లేన్‌, మెహఫిల్‌ హోటల్‌ లేన్‌, నల్లపోచమ్మ ఆలయ వీధి, జూడియో లేన్‌ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు దేవేందర్‌నగర్‌ ఫీడర్‌ పరిధిలోని దేవేందర్‌నగర్‌, లక్ష్మీనారాయణ కాలనీ, బస్తీ దవాఖాన, వకీల్‌ బిల్డింగ్‌ లేన్‌ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.


ఆజామాబాద్‌: ఆజామాబాద్‌, హైదరాబాద్‌ సిటీ-1 డివిజన్‌ పరిధిలో శనివారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు నరేంద్రరాజు. వినోద్‌కుమార్‌ తెలిపారు. బౌద్ధనగర్‌, జామై ఉస్మానియా, చిక్కడపల్లి, అహోబిల్‌మఠ్‌, పార్శిగుట్ట ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు. అలాగే, జవహర్‌నగర్‌, ఏపీ టూరిజం, ఏసీ గార్డ్స్‌ ప్రాంతాల పరిధిలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మూన్‌ కేఫ్‌, డీడీ కాలనీ, కేశవ్‌మెమోరియల్‌, ఆర్‌వోఎమ్‌, గంగపుత్ర, హిందూ ప్రచార సభ, పోస్టాఫీస్‌, రోజరీ కాన్వెంట్‌, బాబూఖాన్‌ ఎస్టేట్‌ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు కరెంట్‌ సరఫరాను నిలిపివేస్తామన్నారు.


కేపీహెచ్‌బీకాలనీ: టీజీఎస్పీడీసీఎల్‌ వసంతనగర్‌, బాలాజీనగర్‌ సెక్షన్ల పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు కోసం శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈలు ఇంద్రసేనా రెడ్డి, భీమాలింగప్ప వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. వసంతనగర్‌లో.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు భగత్‌సింగ్‌నగర్‌, కేపీహెచ్‌బీ ఆరోఫేజ్‌ పార్కు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యూ ఆరోఫేజ్‌. బాలాజీనగర్‌ పరిధిలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాందేవ్‌ హాస్పిటల్‌, ఆకార్‌ ఆశా హాస్పిటల్‌, కళ్యాణ్‌ జ్యువెలర్స్‌, విజేత సూపర్‌ మార్కెట్‌, సాయిబాబా ఆలయం, ఫ్రీడం పార్కు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంజనేయనగర్‌, మహిళా మండలి, చైతన్య యూత్‌, యాదవ బస్తీ, ఇందిరానగర్‌ పరిసర ప్రాంతాలు.


చిక్కడపల్లి: ఆజామాబాద్‌, హైదరాబాద్‌ సిటీ-1 డివిజన్‌ పరిధిలో శనివారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు నరేంద్రరాజు. వినోద్‌కుమార్‌ తెలిపారు. బౌద్ధనగర్‌, జామై ఉస్మానియా, చిక్కడపల్లి, అహోబిల్‌మఠ్‌, పార్శిగుట్ట ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు. అలాగే, జవహర్‌నగర్‌, ఏపీ టూరిజం, ఏసీ గార్డ్స్‌ ప్రాంతాల పరిధిలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మూన్‌ కేఫ్‌, డీడీ కాలనీ, కేశవ్‌మెమోరియల్‌, ఆర్‌వోఎమ్‌, గంగపుత్ర, హిందూ ప్రచార సభ, పోస్టాఫీస్‌, రోజరీ కాన్వెంట్‌, బాబూఖాన్‌ ఎస్టేట్‌ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు కరెంట్‌ సరఫరాను నిలిపివేస్తామన్నారు.


city1.2.jpg

- ఇంద్రానగర్‌ 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ పరిధిలోని పద్మావతి కాలనీ, అమ్మసాని వెంకట్‌రెడ్డి కాలనీ, ఆర్‌ఎన్‌ఎస్‌ కాలనీ, బీఎల్‌ నగర్‌, అంజయ్య ఎన్‌క్లేవ్‌, టెలిఫోన్‌ కాలనీ ఫేజ్‌-2, పీఎన్‌ఆర్‌ కాలనీ, రెడ్డీస్‌ కాలనీ, భవానీ కాలనీ, శుభోదయ కాలనీ, లెక్చరర్స్‌ కాలనీ, గ్రీన్‌ సిటీ కాలనీ, అనగాపురి కాలనీ, భీమ్‌రెడ్డి నగర్‌, ఎన్‌ఐఎన్‌ కాలనీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ ఎన్‌.వేణుగోపాల్‌ తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ బొల్లిగూడెం ఫీడర్‌ పరిధిలోని బొల్లిగూడెం, అంజయ్య ఎన్‌ క్లేవ్‌, అమ్మసాని వెంకట్‌రెడ్డి కాలనీ, ఎస్‌బీఆర్‌ కాలనీ, టెలిఫోన్‌ కాలనీ, రాజలింగం కాలనీ ఫేజ్‌-1, ఫేజ్‌-2, సూరజ్‌ నగర్‌, మహాలక్ష్మీ నగర్‌, బాలాజీ నగర్‌, లక్ష్మారెడ్డి నగర్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు.


పేట్‌బషీరాబాద్‌: సాంకేతిక మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్‌ సరఫరాను నిలిపి వేస్తున్నట్లు కొంపల్లి సబ్‌స్టేషన్‌ ఏఈ శ్రీనివాస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మల్లారెడ్డి బీఈడీ కళాశాల కేవీఆర్‌ గార్డెన్స్‌ లైన్‌, సినీప్లానెట్‌ విజయశాంతి విల్లాస్‌రోడ్డు, నోబెల్‌ ఎన్‌సీఎల్‌ కాలనీల్లో విద్యుత్‌ ఉండదన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం గం.2:30ల నుంచి సాయంత్రం 5గంటల వరకు న్యూమెర్క్‌ అపార్ట్‌మెంట్స్‌, ఆర్‌కే హోటల్‌లైన్‌, శ్వేతశుభం, రాయల్‌ మిడోస్‌, తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నామన్నారు. విద్యుత్‌ వినియోగ దారులు సహకరించాలని కోరారు.


రాయదుర్గం: చర్చి ఐటీ, టింబర్‌ లేక్‌ విద్యుత్‌ ఫీడర్ల పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శివకృష్ణప్రసాద్‌ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నానక్‌రాంగూడ, అలేఖ్య హోమ్స్‌, సుముదుర అపార్ట్‌మెంట్స్‌, రాయదుర్గం కిమ్స్‌హాస్పిటల్‌ వెనుక ప్రాంతం, రాయదుర్గం మెయిన్‌రోడ్డులో విద్యుత్‌ ఉండదన్నారు. రామాలయం విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు గాంధీ ఎస్టేట్‌, హుడా ట్రేడ్‌ సెంటర్‌, లింగంపల్లి గ్రామంలో.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు శివాజీనగర్‌, లింగంపల్లి, తారానగర్‌, వెంకటాద్రినగర్‌లో విద్యుత్‌ ఉండదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ధరల పతనం.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..

శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 20 , 2026 | 07:25 AM