అన్నదాత సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం: మంత్రి అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Jun 20 , 2026 | 09:44 AM
అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ తొలి విడత నిధులను ఈరోజు(శనివారం) విడుదల చేయనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. 46.85 లక్షల రైతు కుటుంబాలకు రూ.3,125 కోట్లు జమకానున్నట్లు తెలిపారు.
అమరావతి, జూన్ 20: ‘అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్’ తొలి విడత నిధులను ఈరోజు(శనివారం) విడుదల చేయనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. 46.85 లక్షల రైతు కుటుంబాలకు రూ.3,125 కోట్లు జమకానున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లింగంగుంట్ల నుంచి నిధులను విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేల చొప్పున జమ అవుతాయన్నారు. రాష్ట్ర వాటాగా రూ.2,342.92 కోట్లు విడుదల చేయనుండగా, కేంద్ర పీఎం కిసాన్ వాటాగా రూ.782.55 కోట్లు జమకానున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
సూపర్ సిక్స్ హామీల అమలులో మరో కీలక అడుగు పడిందని మంత్రి తెలిపారు. రైతుల పెట్టుబడి భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని తెలిపారు. అన్నదాతల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నేరుగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ నిధులు జమకానున్నాయన్నారు. రైతు కుటుంబాల ఆర్థిక భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అన్నదాత సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ఉండవల్లిలో భారీ ఏర్పాట్లు
Read Latest AP News And Telugu News