ఉండవల్లిలో నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం.. భారీ ఏర్పాట్లు
ABN , Publish Date - Jun 20 , 2026 | 07:02 AM
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు నేడు అమరావతిలో భారీ ఏర్పాట్లు చేశారు. ‘యోగాంధ్ర-2026’ కార్యక్రమంలో భాగంగా చారిత్రాత్మక ఉండవల్లి గుహల వద్ద ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.
అమరావతి, జూన్ 20: అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు నేడు అమరావతిలో భారీ ఏర్పాట్లు చేశారు. ‘యోగాంధ్ర-2026’ కార్యక్రమంలో భాగంగా చారిత్రాత్మక ఉండవల్లి గుహల వద్ద ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. వేడుకల సందర్భంగా ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా యోగాసనాలు వేయనున్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే ఈ ప్రత్యేక యోగా ప్రదర్శనల కోసం అధికారులు ఉండవల్లి గుహల వద్ద భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు.
యోగా సాధన ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణాన్ని సాధించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేవలం అమరావతిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నిత్యం యోగా సాధన చేయడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఆరోగ్యం మెరుగుపడతాయని ఈ సందర్భంగా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉండవల్లి వేడుకల్లో భాగంగా జరగనున్న ఈ యోగా దినోత్సవానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఈ చారిత్రాత్మక వేడుకలను విజయవంతం చేసి, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు, నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
బీచ్ ఒడ్డున జాగ్రత్తగా ఉండకపోతే ఇంతే.. ప్రమాదం ఎలా ముంచుకొచ్చిందో చూడండి..
బామ్మ నిర్లక్ష్యం.. సైక్లిస్టుల ప్రాణాల మీదకు వచ్చిందిగా... వీడియో వైరల్