Share News

బామ్మ నిర్లక్ష్యం.. సైక్లిస్టుల ప్రాణాల మీదకు వచ్చిందిగా... వీడియో వైరల్

ABN , Publish Date - Jun 18 , 2026 | 12:21 PM

జర్మనీలో జరిగిన ఒక జూనియర్ సైక్లింగ్ రేసులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. స్కూటర్‌పై వెళ్తున్న ఒక వృద్ధురాలు రేసు మార్గంలోకి రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది.

బామ్మ నిర్లక్ష్యం.. సైక్లిస్టుల ప్రాణాల మీదకు వచ్చిందిగా... వీడియో వైరల్
Germany Cycling Race

ఇంటర్నెట్ డెస్క్: జర్మనీలో జరిగిన ఒక జూనియర్ సైక్లింగ్ రేసులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. స్కూటర్‌పై వెళ్తున్న ఒక వృద్ధురాలు రేసు మార్గంలోకి రావడంతో ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొస్తున్న సైక్లిస్టుల దారికి ఆమె అడ్డంగా రావడంతో ఒకరినొకరు ఢీకొంటూ సుమారు ఐదుగురు సైక్లిస్టులు రోడ్డుపై పడిపోయారు. గొలుసుకట్టుగా జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఐరోపా నలుమూలల నుంచి యువ సైక్లిస్టులను ఆకర్షించేందుకు సార్లాండ్ ట్రోఫియో జూనియర్స్ పోటీలు నిర్వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఈవెంట్‌లో మంచి స్థానం సాధించాలనే పట్టుదలతో వంద మందికి పైగా సైక్లిస్టులు రేసులో పోటీపడ్డారు. పోటీ తీవ్రంగా సాగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో రేసులో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. సైక్లిస్టులు వేగంతో ట్రాక్‌పై దూసుకొస్తున్నారు. అదే సమయంలో ప్రేక్షకుల గుంపులో ఉన్న ఓ వృద్ధురాలు తన స్కూటర్‌తో రేస్ మార్గంలోకి దూసుకొచ్చింది. దీంతో ఓ సైకిలిస్టు నియంత్రణ కోల్పోయి హ్యాండిల్‌బార్ల మీదుగా గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు. అతని వెనుకే వస్తున్న మిగతా రైడర్లు కూడా ఒకరిపై ఒకరు పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.


Also Read:

ఎలక్ట్రిక్ కారుతో సుదూర ప్రయాణం? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఎంతటి జ్ఞానవంతుడైనా ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు

Updated Date - Jun 18 , 2026 | 01:57 PM