Share News

ప్రయాణాల్లో వాంతికి రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి.. వీడియో వైరల్

ABN , Publish Date - Jun 17 , 2026 | 09:54 AM

ప్రయాణాల సమయంలో చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్య మోషన్ సిక్నెస్. బస్సులోనో, కారులోనో ప్రయాణించేటప్పుడు వాంతులు అవ్వడం వల్ల ప్రయాణం మొత్తం నరకంగా మారిపోతుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఓ వ్యక్తి సింపుల్ చిట్కా ట్రై చేసి చూపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రయాణాల్లో వాంతికి రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి.. వీడియో వైరల్
Travel Vomiting Remedy

ఇంటర్నెట్ డెస్క్: ట్రావెలింగ్ సమయంలో చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్య మోషన్ సిక్నెస్. బస్సు, కారులోనో ప్రయాణించేటప్పుడు వాంతులు అవ్వడం వల్ల ప్రయాణం మొత్తం నరకంగా మారితుంటుంది. ప్రస్తుతం ఇలాంటి సమస్యకు పరిష్కారం చూపుతూ ఓ వ్యక్తి చెప్పిన వింత చిట్కా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ప్రయాణంలో వాంతులు కాకుండా ఉండేందుకు ఒక వింత చిట్కా‌ను చూపించారు. ఆయన ఓ వ్యక్తి మణికట్టుపై ఒక నాణేన్ని ఉంచి, దానిపై బ్యాండేజ్ పట్టీని అంటించారు. ఇలా చేస్తే ప్రయాణంలో ఎప్పటికీ వాంతులు కావని, దీనికి తనది గ్యారెంటీ అని ఆయన నమ్మకంగా చెప్పారు. ఈ వినూత్నమైన ఐడియా సోషల్ మీడియా వినియోగదారుల దృష్టిని ఆకర్షించడంతో వీడియో కాస్తా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మణికట్టుపై ఉండే ఆ ప్రదేశాన్ని 'PC6 ఆక్యుపంక్చర్ పాయింట్' అంటారని, ఇది చైనీస్ వైద్య విధానంలో భాగమని, దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తింపు కూడా ఉందని సదరు యూజర్ వివరించారు. ఏది ఏమైనప్పటికీ ఈ వింత చిట్కా వీడియో మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

జపాన్ జనాల పద్ధతే వేరు.. ప్రపంచం ఫిదా

ఒక బాయ్‌ఫ్రెండ్‌గా నాకు కొన్ని బాధ్యతలు తప్పవు.. జస్టిన్ ట్రూడో

Updated Date - Jun 17 , 2026 | 11:20 AM