Share News

ఒక బాయ్‌ఫ్రెండ్‌గా నాకు కొన్ని బాధ్యతలు తప్పవు.. జస్టిన్ ట్రూడో

ABN , Publish Date - Jun 14 , 2026 | 02:17 PM

ఫిఫా వరల్డ్ కప్‌లో కెనడా ప్రారంభ మ్యాచ్‌కు హాజరుకాకుండా గర్ల్‌ఫ్రెండ్‌ కేటీ పెర్రీతో కలిసి మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో అమెరికాలో మ్యాచ్‌ చూడటంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, బాయ్‌‌ఫ్రెండ్‌గా తనకూ కొన్ని బాధ్యతలు ఉంటాయంటూ ట్రూడో నెట్టింట సరదాగా పోస్టు పెట్టారు.

ఒక బాయ్‌ఫ్రెండ్‌గా నాకు కొన్ని బాధ్యతలు తప్పవు.. జస్టిన్ ట్రూడో
Katy Perry, Justin Trudeau

ఇంటర్నెట్ డెస్క్: కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ను తన గర్ల్‌ఫ్రెండ్, పాప్ సింగర్ కేటీ పెర్రీతో కలిసి అమెరికాలో వీక్షించారు. శుక్రవారం యూఎస్, పరాగ్వే మధ్య జరిగిన మ్యాచ్‌కు కేటీ పెర్రీతో కలిసి హాజరయ్యారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కేటీ.. మ్యూజిక్ ప్రదర్శన కూడా ఇచ్చారు. అనంతరం బాయ్‌ఫ్రెండ్ ట్రూడోతో కలిసి మ్యాచ్‌ను వీక్షించారు. వారు మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

అయితే, ట్రూడో తీరుపై మాత్రం కెనడా పౌరులు అనేక మంది మండిపడ్డారు. మాజీ ప్రధాని అయిన ట్రూడో తన దేశ ప్రారంభ మ్యాచ్‌కు హాజరుకాకుండా మరో దేశానికి వెళ్లడమేమిటని ప్రశ్నించారు. రకరకాల విమర్శలు గుప్పించారు. అయితే, ఈ విమర్శలకు ట్రూడో మాత్రం సరదాగా సమాధానం ఇచ్చారు. ‘బాయ్‌ఫ్రెండ్‌గా ఉన్నప్పుడు కొన్ని బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ నేను ఏ టీమ్‌కు మద్దతు ఇస్తానో మీకందరికీ తెలుసు’ అంటూ తన అభిమానులు, విమర్శకులను ఉద్దేశించి ఒక పోస్టు పెట్టారు.


కేటీ, ట్రూడో డేటింగ్‌లో ఉన్నట్టు గతేడాది మొదటిసారిగా వార్తలు వచ్చాయి. తాము రిలేషన్‌షిప్‌లో ఉన్న మాట వాస్తవమేనని ఆ తరువాత వారు పేర్కొన్నారు. అనంతరం పలు ఈవెంట్లకు ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని హాజరయ్యారు. ఈ వారం మీడియాతో కేటీ మాట్లాడుతూ తాను ప్రేమలో ఉన్నానని కూడా చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

ఏంటీ.. మస్క్ ఇంత చిన్న ఇంట్లో ఉంటారా?

జడ్జి సీటులో కూర్చున్న మహిళ! ఆర్డర్.. ఆర్డర్.. అంటూ

Updated Date - Jun 14 , 2026 | 02:33 PM