Share News

ఏంటీ.. మస్క్ ఇంత చిన్న ఇంట్లో ఉంటారా?

ABN , Publish Date - Jun 14 , 2026 | 01:44 PM

అపరకుబేరుడైన ఎలాన్ మస్క్ ప్రస్తుతం 400 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణం ఉన్న ఇంటిలో ఉంటున్నారు. పనిపై ఏకాగ్రత చెదరని విధంగా తన కంపెనీలకు దగ్గరగా ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేని ఇంట్లో ఉంటున్నట్టు మస్క్ చెప్పారు.

ఏంటీ.. మస్క్ ఇంత చిన్న ఇంట్లో ఉంటారా?
Elon Musk

ఇంటర్నెట్ డెస్క్: టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించారు. స్పేస్ ఎక్స్ సంస్థ ఐపీఓ అనంతరం ఆయన సంపద కొత్త పుంతలు తొక్కింది. అనితరసాధ్యమైన సంపదను సొంతం చేసుకున్న మస్క్ ఒక చిన్న ఇంట్లోనే ఉంటారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పనే ప్రపంచంగా బతికే మస్క్ కనీస అవసరాలకు అనుగుణంగా కేవలం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో గల ఇంట్లో ఉంటున్నారు.

గతంలో కాలిఫోర్నియాలో ఉండే సమయంలో మస్క్‌కు విలాసవంతమైన భవనాలు ఉండేవి. అక్కడి నుంచి ఆస్టిన్‌కు (టెక్సాస్‌) మకాం మార్చాక ఆయన ధోరణి మారింది. కాలిఫోర్నియాలో తనకు ఉన్న అధిక శాతం ఆస్తులను మస్క్ విక్రయించారు. ఆస్టిన్‌లో కొన్ని లగ్జరీ భవనాలను కొనుగోలు చేశారు.


అయినప్పటికీ ప్రస్తుతం టెక్సాస్‌లోని స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌బేస్ క్యాంపస్‌లో చిన్న ఇంట్లో ఉంటున్నారు. కంపెనీ నుంచే దీన్ని అద్దెకు తీసుకున్నట్టు చెప్పారు. 20 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఇంటిని బోక్సాబీ అనే స్టార్టప్ సంస్థ రూపొందించింది. లివింగ్ రూమ్, బెడ్ రూమ్, కిచెన్ మినహా మరేమీ ఉండవు. తన వ్యాపారాలకు దగ్గరగా ఉంటూ పనికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలన్న ఫిలాసఫీకి అనుగుణంగా ఇలాంటి లైఫ్ స్టైల్‌ను ఎంచుకున్నట్టు మస్క్ గతంలో ఒకసారి చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

మెటా ఉద్యోగి గుస్సా! వేల మంది హాజరైన మీటింగ్‌లో..

40 మీటర్ల ఎత్తునుంచి తోసేశారు.. యువతి ప్రాణం పోయింది..

Updated Date - Jun 14 , 2026 | 02:21 PM