Share News

జపాన్ జనాల పద్ధతే వేరు.. ప్రపంచం ఫిదా

ABN , Publish Date - Jun 15 , 2026 | 02:38 PM

ఫిఫా మ్యాచ్ ముగిశాక జపాన్ ఫ్యాన్స్ స్టేడియాన్ని శుభ్రం చేసిన వైనం ప్రస్తుతం అనేక మందిని ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

జపాన్ జనాల పద్ధతే వేరు.. ప్రపంచం ఫిదా
Japanese Fans Cleaning Stadium after match

ఇంటర్నెట్ డెస్క్: ఫిపా వరల్డ్ కప్ నేపథ్యంలో ప్రస్తుతం జపాన్ జనాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. వారి పద్ధతే వేరంటూ జనాలు జేజేలు పలుకుతున్నారు. అమెరికాలో ఫిఫా మ్యాచ్ చూసేందుకు వెళ్లిన జపాన్ ఫ్యాన్స్ ఆట ముగిశాక చేతులు దులుపుకుని వెళ్లిపోకుండా స్టేడియంలో స్టాండ్స్‌ను శుభ్రం చేశారు. టెక్సాస్‌లో నెదర్లాండ్స్ వర్సెస్ జపాన్ మ్యాచ్ అనంతరం ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.


తమ సీట్లకు చుట్టు పక్కల ఉన్న చెత్తాచెదారాన్ని జపాన్ జనాలు బ్యాగుల్లోకి ఎత్తి పక్కన పెట్టిని వైనం అనేక మందిని ఆకట్టుకుంటోంది. పరాయి దేశం విషయంలో తమ బాధ్యతను గుర్తెరిగి వారు వ్యవహరించిన తీరు జనాలను కట్టిపడేసింది. ఇలాంటి అలవాట్లను తాము స్కూలు రోజుల నుంచే నేర్చుకుంటామని స్టేడియంలోని ఒక జపాన్ యువకుడు చెప్పాడు. ‘ఒక ప్రదేశం నుంచి మనం వెళ్లేటప్పుడు అక్కడ ఎలాంటి అపరిశుభ్రత లేకుండా చూడాలని మేము భావిస్తాము. స్కూళ్లల్లోనే మాకు ఇది అలవాటు చేస్తారు. టీచర్లు చెప్పకుండానే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాము’ అని అతడు చెప్పాడు.


శుభ్రత విషయంలో వారు చూపుతున్న శ్రద్ధ చూస్తుంటే వారిపై గౌరవం కలుగుతోందని నెటిజన్లు కామెంట్ చేశారు. సంపద, టెక్నాలజీ ఉన్నంత మాత్రాన ఒక దేశం గొప్పదనం సంతరించుకోదని జనాలు అభిప్రాయపడ్డారు. ప్రజలు బాధ్యతతో నడుచుకున్నప్పుడే వారి దేశం అసలైన గుర్తింపు సాధిస్తుందని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

ఒక బాయ్‌ఫ్రెండ్‌గా నాకు కొన్ని బాధ్యతలు తప్పవు.. జస్టిన్ ట్రూడో

ఏంటీ.. మస్క్ ఇంత చిన్న ఇంట్లో ఉంటారా?

Updated Date - Jun 15 , 2026 | 03:09 PM